Sunday, December 22, 2024

బెంగాల్ లో అమీ తుమీకి బీజేపీ రెడీ

  • బీజేపీ తీర్థం పుచ్చుకున్న మిహిర్ గోస్వామి
  • రవాణా మంత్రి సుబేందు అధికారి రాజీనామా
  • పార్టీలో పెరుగుతున్న అసంతృప్త నేతలు
  • మమతకు సవాలుగా మారనున్న ఎన్నికలు
  • అసంతృప్త నేతలకు గాలం వేస్తున్న బీజేపీ

దేశవ్యాప్తంగా అప్రతిహత విజయాలతో దూసుకెళుతున్న బీజేపీకి కొరకరాని కొయ్యగా మారిన బెంగాల్ పై దృష్టి సారించింది.  రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఇప్పటి నుంచే పదునైన వ్యూహాలను రచిస్తున్నారు బీజేపీ నేతలు. దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన ఉపఎన్నికలతో పాటు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాలతో ఊపుమీదున్న బీజేపీ తృణమూల్ పునాదులను పెకలించి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు అస్త్ర శస్త్రాలతో సిద్ధమవుతోంది.

మమతకు గడ్డు కాలం

గత రెండు పర్యాయాలుగా ముఖ్యమంత్రిగా అధికారం చెలాయిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ  రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీకి అడ్డుతగులుతున్నారు. ఇది ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తరచూ ఘర్షణలకు దారితీస్తున్నది. గ్రామ స్థాయిలో బీజేపీ కార్యకర్తలు, అధికార తృణమూల్ కార్యకర్తలు పరస్పరం దాడులకు పాల్పడుతున్నారు. అయితే ప్రజల్లో సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకత, విపక్షాలు బలం పుంజుకుంటున్న కారణంగా మమత రాబోయే ఎన్నికల్లో కఠిన పరీక్షను ఎదుర్కోనున్నారు. వీటికి తోడు అంతర్గత విభేదాలతో అసంతృప్త నేతలు పార్టీ పరువును బజారుకీడుస్తున్నారు. బీజేపీ మాత్రం అధికారపార్టీ వైఫల్యాలను ఎండగడుతూనే అసంతృప్త నేతలకు గాలం వేస్తోంది. గత లోక్ సభ ఎన్నికల్లో   42 ఎంపీ స్థానాలకు గాను  18 స్థానాల్లో అనూహ్య విజయం సాధించి ఊపుమీదున్న బీజేపీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తృణమూల్ కాంగ్రెస్ ను చావుదెబ్బతీసి అధికారం చేపట్టాలని తహతహలాడుతోంది.

క్షేత్రస్థాయిలో వ్యూహాల అమలు

ఇప్పటికే బెంగాల్ లో ఎన్నికల వ్యూహాలను రచిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్షేత్ర స్థాయిలో అమలు చేయాల్సిన వ్యూహాలను కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. బీజేపీ మాతృసంస్థ అయిన ఆర్ఎస్ఎస్ శ్రేణులు రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పొరుగున ఉన్న బీహార్ లో విజయం సాధించడంతో సాధారణంగా కొంత సానుకూల వాతావరణం నెలకొంటుందన్న ఆశాభావంతో బీజేపీ ఉంది. 2016 అంసెబ్లీ ఎన్నికల్లో 10 శాతం ఓట్లతో కేవలం మూడు స్థానాలను మాత్రమే బీజేపీ దక్కించుకోగలిగింది. అదే పార్టీ 2019 లోక్ సభ ఎన్నికల్లో 40.64 శాతం ఓట్లతో 18 స్థానాల్లో ఊహకందని విజయాలను సొంతం చేసుకుంది.

పీకే ఎంట్రీతో అసంతృప్తి సెగలు

ఎన్నికల వ్యూహకర్తగా నియమితుడైన ప్రశాంత్ కిశోర్ పై పార్టీలో పలువురు నేతలు బహిరంగంగానే విమర్శలు కురిపిస్తున్నారు. పీకే సూచనలపై మమత తీసుకున్న నిర్ణయాలతో పార్టీ నేతల్లో ఆగ్రహం పెరుగుతోంది. ప్రక్షాళన పేరుతో మమత సీనియర్ నాయకుల్ని పక్కన పెడుతుండటంతో అసంతృప్త నేతల జాబితా పెరుగుతోంది. అధినేత్రిపై అసంతృప్తితో రవాణా మంత్రి సుబేందు అధికారి రాజీనామా చేశారు. హరిహర్ పారాకు చెందిన ఎమ్మెల్యే నియామత్ షేక్ నేరుగా పీకీపై విమర్శలు చేశారు.

కమలం గూటికి తృణమూల్ ఎమ్మెల్యే

ఇదిలా ఉంటే తృణమూల్ అసంతృప్త నేతలు బీజేపీలో చేరుతున్నారు. పార్టీ ప్రారంభం నుంచి మమత వెన్నంటి ఉన్న ఎమ్మెల్యే మిహిర్ గోస్వామి పార్టీలో తీరని అవమానం జరిగిందంటూ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ ఎంపీ నిసిత్ ప్రమాణిక్ తో కలిసి ఢిల్లి వెళ్లి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గీయ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు.

ఎత్తుకు పైఎత్తు వేస్తున్న మమత

బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు మమత కూడా సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్, ఎంఐఎంలతో పొత్తు పెట్టుకోవచ్చనే సంకేతాలు వెలువుడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి బీహార్ ఎన్నికల్లో పోటీచేసి ఐదు చోట్ల విజయం సాధించిన ఎంఐఎం తృణమూల్ తో పొత్తు పెట్టుకునేందుకు సానుకూలంగా ఉన్నట్లు సమాచారం.

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles