కేరళ.. తమిళనాడు లలో.. బెంగాల్ లో గెలిపు..ఓటముల పరిస్థితి పై కొంత అంచనా ఉన్న బిజెపి.. బెంగాల్ పై ఎక్కువ కేంద్రీకరించాలి అని నిర్ణయం తీసుకుంది. అందుకే పీఎం మోదీ.. హోమ్ మంత్రి అమిత్ షా.. ఇతర మంత్రులు బిజెపి సీఎం లో బెంగాల్ చుట్టూ తిరుగుతూ బెంగాల్ ముఖ్యమంత్రి దీదీ మమతా బెనర్జీ ని టార్గెట్ చేశారు. స్థిమిత రాజకీయాలు లేని నటుడు మిత్తున్ వస్తే లాభం అనుకున్న బిజెపి నేతలకు ఆయన తాను కోబ్రా నంటూ చేసిన ఉపన్యాసాలు నష్టాన్ని కొని తెచ్చాయి.. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ బెంగాల్ సీఎంను మావోయిస్టు అనే విధంగా. ఆమె పని అయిపోయిందని టార్గెట్ చేసే పరిస్థితి వచ్చింది. నందిగ్రామ్ లో సంఘటనల పరంపర వల్ల ఉద్రిక్తత చోటుచేసుకుంది. మరోవైపు రైతుల ఉద్యమం జరుగుతున్న సందర్భంగా రైతు నేతలు వచ్చి బిజెపి కి ఓటువేయద్దని ర్యాలీలు.. పంచాయతీలు నిర్వహించినా ప్రభావం బిజెపి ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
75 లక్షల రైతు కుటుంబాలు
బెంగాల్ లో మొత్తం రైతు కుటుంబాలు 75 లక్షల50 వేలవరకు ఉన్నాయి. జనాభాలో వీరు 4 కోట్లు ఉంటారు. సన్నకారు రైతులు ఉన్నారు. 30 శాతం ముస్లింలు ఉన్నారు. సుమారు 65 వేల ఓటర్లు ఉన్నారు. వీరంతా బీజేపీ కి వ్యతిరేకంగా ఓటు వేస్తారని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. బిజెపి కి గ్రౌండ్ రియాలిటీ (క్షేత్రవాస్తవికత) తెలిసి పోయింది. దీనితో సహజంగానే కాస్త ఆవేశం ఎక్కువ ఉన్న దీదీ రెచ్చిపోవడానికి కారణాలను వెతికి మరీ సభల్లో పీఎం సైతం ఆమె పై విమర్శలు చేస్తున్నారు. వాస్తవానికి దేశంలో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం పరిస్థితి బాగోలేదు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ బలహీన పడుతుందనే అభిప్రాయం ఉంది. లీడర్ షిప్ పై ఆ పార్టీ లో మల్లగుల్లాలు పడుతున్నారు. వామపక్షాలు పార్లమెంటరీ విధానం వెంట పడుతూ దానినే నమ్ముకుంటూ ప్రజా సమస్యలపై ఉద్యమాలు గతంలో మాదిరి నిర్మించడంలో వైఫల్యం చెందారు. ఉనికిని జీవించి ఉంచాలని పార్టీల లోని కాస్తో కూస్తో నిబద్ధత ఉన్న కార్యకర్తలు ఆరాటపడుతుంటారు. ఆ ఫలితంగానే వామపక్షాలు ఇంకా జనంలో ఉన్నాయి అని పేర్కొనవచ్చు.
Also Read : వంగభూమిలో బీజేపీకి కష్టమే
ప్రాంతీయపార్టీల పని పట్టాలని బీజేపీ యత్నం
ఈ పరిస్థితుల్లో బిజెపి ఆయా రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీ ల, ముఖ్యంగా ఆయా రాష్ట్రాల్లో అధికారం లో ఉన్న ప్రాంతీయ పార్టీల వెంట పడింది. ఆ ప్రభుత్వాలను బలహీనం చేసే పనిలో పడింది. బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ ను ఓడించడం ద్వారా రేపు కేంద్రంలో యూపీఏ రాకుండా అడ్డుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే బెంగాల్ లో మూడోసారి విజయం కోసం పోరాడుతున్న తృణమూల్ విజయం సాధించిన వెంటనే కేంద్రంలో మార్పుకు జాతీయ రాజకీయ సమీకరణాలు వైపు దృష్టి పెడతానని మమతా బెనర్జీ ప్రకటించారు. దేశంలో లేడీ బెంగాల్ టైగర్ గా దీదీ కి పేరుంది. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే దమ్ముంది. 7 సార్లు ఎంపీ గా, పలు మార్లు కేంద్ర మంత్రి గా పనిచేసిన అనుభవం ఉంది. ఇప్పటికే తెలంగాణ సీఎం టిఆరెస్ అధ్యక్షుడు కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ఒకసారి కృషి చేసి ఉన్నారు. ఆ ప్రయత్నం ఇంకా ఆ ప్రతిపాదన పరిశీలనలోనే ఉంది. మొత్తానికి ఈ అన్ని రకాల కారణాల రీత్యా బెంగాల్ పై బిజెపి కేంద్రీకరించింది.
కొన్ని నియోజకవర్గాలలో అభ్యర్థులే కరువు
కొన్ని చోట్ల నిలబెట్టడానికి అభ్యర్థులు లభించకుండా పోవడం, కార్యాలయంలో టిక్కెట్ల కోసం బీజేపీ కార్యకర్తల లొల్లి… మాజీ కేంద్ర మంత్రి యస్వంత్ సిన్హా లాంటి వారు తృణమూల్ కాంగ్రెస్ లో చేరి ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం బిజెపి ని ఓడించాలని ప్రజలకు విజ్ఞప్తి చేయడం. అన్నింటికీ మించి బిజెపి పై రైతుల వ్యతిరేకత నేరుగా బిజెపి కి ఓటు వేయవద్దని చెప్పడం లాంటి పరిణామాలు బిజెపి బెంగాల్ లో అధికారానికి రావడం సుదూరపు మాట. ప్రభుత్వం లో ప్రశ్నించే ప్రతిపక్షంగా అయినా స్థానాలు దక్కించుకుంటే చాలు అని ప్రస్తుత గ్రౌండ్ రిపోర్ట్ లు అద్దంలా ముందు కనిపిస్తున్నాయి. దేశం అంతా రైతులు బిజెపి కి వ్యతిరేకంగా చేస్తున్న ప్రచార ప్రభావం ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల పై ఉంటుంది. మమతా బెనర్జీ ని టార్గెట్ చేసి మరీ బిజెపి ఆమె పై మహిళ అనికూడా చూడకుండా చేస్తున్న ప్రచారంలో వాడుతున్న భాష తీవ్ర అభ్యంతరకరంగా ఉంది. ఈ ధోరణిని బెంగాల్ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు.
Also Read : అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ద్వంద్వ వైఖరి