- సీఏఏ, గోవధపై భిన్న స్వరాలు
- ఓటర్లను మభ్యపెట్టేందుకు
- అసోంలో సీఎం అభ్యర్థిని మార్చిన బీజేపీ
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో సత్తా చాటాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇది బీజేపీకి కత్తి మీద సాములా తయారైంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా స్థానిక పరిస్థితులకు తగ్గట్లుగా వ్యవహరించటంతో ఓటర్లు గందరగోళానికి గురవుతున్నారు. బీజేపీ నేతలకు కూడా ఈ ఇది ఇబ్బందికర పరిణామంగా పరిణమించాయి. జాతీయ అజెండాలో కీలక అంశాలను ఒక్కో రాష్ట్రంలో ఒక్కో అంశాన్ని పక్కనపెట్టేస్తోంది. దీంతో ఓటర్లు అయోమయంగా నేతల వంక చూస్తున్నారు. దీనికి ప్రత్యర్ధులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ అనుసరిస్తున్నా ఈ విధానం ఓట్లు కురిపిస్తుందో లేదో వేచి చూడాలి.
Also Read: మమత అధికార పీఠం కదులుతోందా?
సీఏఏ అమలుతో ఎదురుదెబ్బ:
జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని తొలిసారిగా అసోంలో అమలు చేసి చేదు ఫలితాలు చవిచూసింది. తాజా ఎన్నికల నేపథ్యంలో అక్కడ సీఏఏ ఊసే ఎత్తడంలేదు. ఏకంగా అసోం మేనిఫెస్టో నుంచి ఆ అంశాన్ని పక్కన పెట్టేసింది. సీఏఏ అమలు ద్వారా నష్టపోయిన వర్గాలను మచ్చిక చేసుకునేందుకు బీజేపీ ఈ వ్యూహం అమలు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు పశ్చిమ బెంగాల్లో మాత్రం సీఏఏ అమలు చేస్తామని పదే పదే చెబుతోంది. తద్వారా బెంగాల్లో సీఏఏ అనుకూల ఓట్లను రాబట్టేందుకు బీజేపీ వ్యూహరచన చేస్తోంది.
తమిళనాడు, కేరళలో భిన్న స్వరాలు:
సీఏఏ తో పాటు బీజేపీ అజెండాలో ఉన్న గోవధ నిషేధంపైనా ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా ప్రచారం చేస్తోంది. ఏప్రిల్ 6న జరగబోతున్న తమిళనాడు, కేరళ ఎన్నికలే దీనికి నిదర్శనం. గతంలో ఎన్నడూలేనంతగా బీజేపీ ఈ ఎన్నికల్లో తొట్రుపాటుకు గురవుతోంది. తమిళనాడులో అధికారంలోకి వస్తే గోవధను నిషేధిస్తామని హామీ ఇస్తున్న బీజేపీ, కేరళలో మాత్రం గోవధ ఊసే ఎత్తేందుకు సాహసించడంలేదు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది.
సీఎం అభ్యర్థి మార్పు దేనికి సంకేతం:
అసోంలో సీఏఏ అమలుపై బీజేపీ ఆచితూచి వ్యవహరిస్తోంది. శర్భానంద్ సోనేవాల్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపట్ల విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సారి ఎన్నికల్లో సీఏఏ వ్యతిరేకతనను అధిగమించేందుకు సీనియర్ మంత్రి హిమంత బిశ్వ శర్మను ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెరపైకి తెచ్చింది. మరి బీజేపీ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరితో ఎటువంటి ఫలితాలు రాబడుతుందో వేచిచూడాల్సిందే.
Also Read: అసెంబ్లీ ఎన్నికలతో మారనున్న దేశ రాజకీయాలు