- ప్రగతిభవన్ వద్ద ఉద్రిక్తత
- పోలీసుల అదుపులో బీజేపీ కార్పొరేటర్లు
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్పొరేటర్లు ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. ముట్టడికి ముందు నగరంలోని హోటల్ హరిత ప్లాజాలో బీజేపీ కార్పొరేటర్లు సమావేశమయ్యారు. భేటీ అనంతరం ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు కార్పొరేటర్లకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ కార్పొరేటర్ల ఆందోళనతో ప్రగతిభవన్, హరితప్లాజా వద్ద ఉద్రిక్తత నెలకొంది. దీంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళన చేస్తున్న కార్పొరేటర్లను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఇదీ చదవండి:జీహెచ్ఎంసీ ఫలితాలు – పరిణామాలు
సీఎం తాత్సారంపై మండిపడ్డ కార్పొరేటర్లు
బల్దియా ఎన్నికల ఫలితాలపై గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. నోటిఫికేషన్ పై కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే తాత్సారం చేస్తున్నారంటూ బీజేపీ కార్పొరేటర్లు ఆరోపించారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం, పాలకమండలి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియ ముగిసి నెలరోజులు గడిచినా ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వటలేదని ఇటీవల గవర్నర్ ను కలిసి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. నూతన పాలకమండలిని వెంటనే ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాము ఎన్నికల్లో గెలిచి నెలరోజులవుతున్నా ఎలాంటి గుర్తింపుకు నోచుకోలేదని కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:జీహెచ్ఎంసీ ఫలితాలు – పరిణామాలు