—————————
(From “The Wanderer” by KAHLIL GIBRAN)
2. మెరుపులూ, పిడుగులూ
———————- ——————
అనగనగా ఒక రోజు ఒక క్రిస్టియన్ బిషప్ చర్చిలో కూర్చొని ఉండగా, మతం పుచ్చుకోని ఒక స్త్రీ వచ్చి , అతనితో ఇలా అంది.
“నేను క్రిస్టియన్ మతం కాదు. నాకు నరకపు అగ్ని జ్వాలల నుంచి విముక్తి ఉందా?”
బిషప్ “లేదు. పవిత్ర జలాలు జల్లించుకొని , మతం తీసుకున్న వారికే మోక్షం వస్తుంది.”
అతను ఆ మాటలు అంటూ ఉండగానే , ఓ పిడుగు , ఉరుముతూ ఆ చర్చి మీద పడింది. చర్చి కాలి పోయింది. గ్రామస్తులందరూ పరుగుతో వచ్చి ఆ స్త్రీ ని రక్షించ గలిగారు. బిషప్ ఆ పిడుగు మంటల్లో కాలి పోయాడు!!
3. నవ్వు, కన్నీళ్లు
———————-
ఒక రోజు సాయంత్రం నైలు నదీ తీరంలో ఒక హైనా, ఒక మొసలి కలుసుకొని అభివందనలు తెలుపుకున్నాయి.
హైనా ” రోజులెట్లా గడుస్తున్నాయి సార్?” అని అడిగింది.
మొసలి ” దారుణంగా ఉన్నాయి. ఒక్కో సారి నా బాధలో, దుఃఖంలో నేనేడ్చినా అందరూ అవి ‘మొసలి కన్నీళ్ళే ‘ అంటున్నారు. అది నా గుండెపై
సమ్మెట పోటులా ఉంది.” అంది.
అపుడు హైనా ఇట్లా అంది. ” నీ బాధ, దుఃఖం గురించే మాట్లాడుతున్నావు. నా గురించి కొంచెం ఆలోచించు. ఈ లోకంలో అందం, అద్భుతాలూ, ఆశ్చర్యాలూ చూసి, కేవలం ఆనందంతో నవ్వితే చాలు – జనాలు అది ‘హైనా నవ్వు’ అంటున్నారు.”
Also read: సంచారి “తత్త్వాలు”