- అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచనలు
- పలు రాష్ట్రాలలో సరస్సులు, జూలు మూసివేత
ఉత్తరప్రదేశ్, కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా. గుజరాత్ లలో ఇప్పటి వరకు బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు బయటపడ్డాయి. తాజగా మహారాష్ట్ర, ఢిల్లీ చేరాయి. ఢిల్లీ ప్రభుత్వం కోళ్ల దిగుమతులను నిలిపివేసింది. ఘజియాపూర్ లోని అతిపెద్ద పౌల్ట్రీ మార్కెట్ ను తాత్కాలికంగా మూసివేశారు. గత నాలుగు రోజుల్లో 27 నీటి బాతులు చనిపోవడంతో ఢిల్లీలోని సంజయ్ లేక్ ను కూడా మూసివేశారు. సంజయ్ లేక్ కు సందర్శకులను అనుమతించడంలేదు. పక్షుల మృత్యువాతకు బర్డ్ ఫ్లూనే కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
ఇది చదవండి: ముంచుకొస్తున్న బర్డ్ ఫ్లూ
మహారాష్ట్రాలో బర్డ్ ఫ్లూ :
బర్డ్ ఫ్లూ దేశ వ్యాప్తంగా క్రమంగా విస్తరిస్తోంది. బర్డ్ ఫ్లూ బాధిత రాష్ట్రాల సరసన మహారాష్ట్ర, ఢిల్లీ కూడా చేరాయి. గత రెండు రోజులుగా మహారాష్ట్రలో దాదాపు 800 పైగా కోళ్లు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పర్బాణీ జిల్లాలో బర్డ్ ఫ్లూ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. చనిపోయిన కోళ్ల నమూనాలను పరీక్షలకు పంపిగా బర్డ్ ఫ్లూ వల్లనే చనిపోయినట్లు రిపోర్టులు వచ్చాయని అధికారులు తెలిపారు. 8 కోళ్ల ఫారాలలో 8 వేలకు పైగా కోళ్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. పర్బాణీకి 10 కిలో మీటర్ల పరిథిలో కఠిన ఆంక్షలు విధించారు. ఛత్తీస్ గడ్ లో బాలోద్ జిల్లాలో పక్షులు మరణిస్తున్నాయి. వీటి నమూనాలను ప్రయోగశాలకు పంపగా రిపోర్టులు ఇంకా అందలేదని అధికారులు తెలిపారు. ఈ వ్యాధి మరింత విస్తరించకుండా నివారణ చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులు జారీ చేసింది. చిన్నపాటి చెరువులు, సరస్సులు, జంతు ప్రదర్శన శాలలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించింది.
బర్డ్ ఫ్లూ పై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ముందు జాగ్రత్తగా పలు ఆంక్షలను అమలుచేస్తోంది. జూ సందర్శించేందుకు వెళ్లరాదని సూచనలు చేసింది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్ లో 215 వలస పక్షులు బర్డ్ ఫ్లూ తో మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు .
పార్లమెంటరీ స్థాయి సంఘం భేటి:
పలు రాష్ట్రాలలో బర్డ్ ఫ్లూ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో పార్లమెంటరీ స్థాయి సంఘం ఈ రోజు (జనవరి 11) భేటీ కానుంది. దీనికి సంబంధించిన వ్యాక్సిన్లను సిద్ధంగా ఉంచాలని కేంద్ర పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించింది. బర్డ్ ఫ్లూ పక్షుల నుంచి మనుషులకు సోకే అవకాశం ప్రస్తుతానికి తక్కువగానే ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఇది చదవండి: బర్డ్ ఫ్లూ బాబోయ్ అంటూ బెంబేలు అనవసరం