Sunday, December 22, 2024

బీహార్ బాహాబాహీ: ఎగ్జిట్ పోల్ లో ఆర్ జేడీ-కాంగ్రెస్ ఫ్రంట్ కు ఆధిక్యం

శనివారంనాడు మూడో విడత పోలింగ్ పూర్తయని తర్వాత పీపెల్స్ పల్స్ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ లో ఆర్ జేడీ –కాంగ్రెస్ మహాకూటమికి ఆధిక్యం ఉన్నట్టు తెలుస్తున్నది.

పట్నా: పీపుల్స్ పల్స్- పీఎస్జీ సంయుక్తంగా నిర్వహించిన  బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్-2020 ముఖ్యాంశాలు

• ఈ ఎన్నికల్లో మహాగట్ బంధన్ (కాంగ్రెస్-ఆర్జేడీ-వామపక్ష కూటమి) కే స్వల్ప ఆధిక్యత లభించే అవకాశం.

• రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) పార్టీకి 85-95 సీట్లు, కాంగ్రెస్ కు 15- 20, ఎల్‌జేపీ 3-5, వామపక్షాలు 3-5 సీట్లు సాధిస్తాయి.

• బీజేపీకి 65-75, జేడీ(యూ) 25-35 సీట్లకే పరిమితం.

• జీడీఎస్ఎఫ్ & ఇండిపెండెంట్లు 5-13 సీట్లు సాధించే అవకాశం.

• ప్రభుత్వ వ్యతిరేకత చాపకింద నీరులా మారితే మహాగట్ బంధన్ ఇంకా ఎక్కువ సీట్లు సాధించే అవకాశముంది. 

• బీహార్ తదుపరి ముఖ్యమంత్రిగా తేజశ్వి యాదవ్ వైపు 36 శాతం, నితీష్ కుమార్ వైపు 34 శాతం మంది ఓటర్లు మొగ్గు చూపారు.

• ఎన్నికల్లో అత్యధిక ప్రభావం చూపిన సమస్యలు నిరుద్యోగం (31%), ధరల పెరుగుదల (28%), వలసలు (19%), వరదలు (12%), ఎంఎస్‌పీ (9%) మరియు ఇతర సమస్యలు (1%).

• తేజశ్వి యాదవ్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు ఓటర్లను బాగా ప్రభావితం చేశాయి. 10 లక్షల ఉద్యోగాల భర్తీ హామీ యువతను ఆకట్టుకుంది.

• ముస్లిం, యాదవ సామాజికవర్గాల్లో అత్యధిక ఓటర్లు ఆర్జేడీ వైపే మొగ్గు చూపారు.

• భూమిహార్ల సామాజికవర్గంసహా ఉన్నత కులాల ఓటర్లు సైతం గణనీయమైన సంఖ్యలో జేడీ (యూ)కి దూరమయ్యారు.

• ఈ ఎన్నికల్లో పెద్దగా పని చేయని దివంగత రాం విలాస్ పాశ్వాన్ తనయుడు  చిరాగ్ పాశ్వాన్ ప్రభావం. అంతిమంగా చిరాగ్ పాశ్వాన్ ప్రచారం ‘మహాగట్ బంధన్’ కే ఎక్కువగా లాభించింది.

• పాట్నా, నలందాతోపాటు వాయువ్య భోజ్‌పురి, బజ్జికా, మైథిలి, ఆంజిక మాట్లాడే ప్రాంతాల్లో జేడీయూకి వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం.

• పలు చోట్ల ఎన్డీయే కూటమి ఓట్లకు గండి కొట్టిన తిరుగుబాటు, స్వతంత్ర్య అభ్యర్ధులు.

• మొత్తం 61 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 305 పోలింగ్ స్టేషన్లలో పీపుల్స్ పల్స్ – పీఎస్జీ సంయుక్తంగా ఎగ్జిట్ పోల్ సర్వే నిర్వహించింది. బీహార్ లోని మొత్తం అసెంబ్లీ స్థానాల్లో ఈ సంఖ్య 25 శాతం. లింగ నిష్పత్తితోపాటు కుల,మత, వయస్సుల వారీ  సమాన ప్రాతిపదికన ఈ సర్వే నిర్వహించింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles