- హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే
- సెలవుల అనంతరం తదుపరి విచారణ
ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా లేదా అనే అంశంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. రాజ్యాంగ విచ్చిన్నం జరిగిందా లేదా తేలుస్తామని అక్టోబరు1న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ప్రభుత్వ పిటీషన్ పై చీఫ్ జస్టిస్ ఎస్ ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.
సుప్రీంలో సుధీర్ఘ విచారణ:
విచారణలో భాగంగా ఏపీలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందని జస్టిస్ రాకేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సరికాదని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎస్‌ఎస్ బోబ్డే అభిప్రాయపడ్డారు.రాజ్యాంగం విచ్ఛిన్నం అనే అంశం రాష్ట్రపతి పరిధిలోనిదని బోబ్డే తెలిపారు.అసలు రాకేష్ కుమార్ ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారో తమకు అర్థం కావడంలేదన్నారు.రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ని న్యాయవాది సిద్దార్థ లూథ్రా వ్యతిరేకించడంపై సుప్రీంకోర్టు మండిపడింది. మీరు ఎన్నాళ్ల నుంచి ప్రాక్టీసు చేస్తున్నారు, గతంలో ఇలాంటి ఆదేశాలు ఎప్పుడైనా ఇచ్చారా అంటూ కోర్టు సిద్దార్థ లూథ్రాపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో కనీసం హెబియస్ కార్పస్ పిటిషన్లపై విచారణకు అనుమతించాలన్న సిద్దార్థ లూథ్రా అభ్యర్థనని కోర్టు నిర్ద్వందంగా తిరస్కరించింది. రాజ్యంగం సంక్షోభంలో ఉందనే భావనతో జడ్జి ప్రభావితం అయినందున అన్ని విచారణలపై స్టే విధిస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.హైకోర్టులో జస్టిస్ రాకేష్‌కుమార్, జస్టిస్ ఉమాదేవి బెంచ్ ఆదేశాలను, విచారణను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. దీనిపై తదుపరి విచారణను శీతాకాలం సెలవుల తర్వాత చేపడతామని తెలిపింది.రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అడ్వకేట్ జనరల్ శ్రీరాం లు వాదనలు వినిపించారు.
ఇది చదవండి:జగన్ పై ఇద్దరు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీం
పిల్ దాఖలు చేసిన శ్రావణ్ కుమార్:
ఏపీలో పోలీసులు చట్ట ఉల్లంఘనలపై దాఖలైన హెబియస్ కార్పస్ పిటీషన్లు, రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న వారిని పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ వేసిన పిల్ పై హైకోర్టు విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాలు ఆందోళనకరంగా ఉన్నాయన్న సుప్రీం చీఫ్ జస్టిస్ బోబ్డే దీనికి సంబంధించిన అన్ని పిటీషన్లపై స్టే విధించారు.
ఇది చదవండి: దేశవ్యాప్తంగా 14 మంది న్యాయమూర్తుల బదిలీ