Monday, December 23, 2024

25 నుంచి ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షలు ప్రారంభం

విజయవాడ: ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దేవస్థానంలో శ్రీ శార్వరీ నామ సంవత్సర భవానీ మండల దీక్షలు ఈనెల 25 నుంచి ప్రారంభంకానున్నాయి. 25 నుంచి 30వ వరకు భవానీలకు మాలధారణ మండల దీక్షలు చేయనున్నారు.  25వ తేదీ ఉదయం 8 గంటలకు భవానీ దీక్షలు ప్రారంభంకానున్నాయి. అలాగే డిసెంబర్ నెలలో అర్ధమండల దీక్షలు ప్రారంభమవుతాయి. డిసెంబర్ 17 నుండి 19  వరకు అర్ధమండల  మాల ధారణ దీక్షలు జరుగనున్నాయి. డిసెంబర్ 29న సాయంత్రం  6 గంటలకు సత్యనారాయణపురంలోని శివరామ కృష్ణ క్షేత్రం నుండి జ్యోతులు ప్రారంభమవుతాయి. 2021 జనవరి 5 నుంచి 9 వరకు మాల విరమణ మహోత్సం జరుగనుంది. జనవరి 5న ఉదయం 6:50 గంటలకు అగ్నిప్రతిష్ఠాపన, ఇరుముడి, అగ్నికుండములు ప్రారంభంకానుంది. జనవరి 9న ఉదయం 11 గంటలకు మహా పూర్ణాహుతితో భవానీ దీక్షలు ముగింపు జరుగనుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles