కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని 13 రోజులుగా రైతులు చేస్తున్న ఆందోళనలో భాగంగా చేపట్టిన భారత్ బంద్ విజయవంతమయింది. బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ కోల్ బెల్ట్ ప్రాంతంలో బొగ్గు గని కార్మికులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. బంద్ నిర్వహిస్తున్న రైతులకు మద్దతుగా మంచిర్యాల జిల్లాలో ని రాజీవ్ రహదారి పై టీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు. ధర్నాలో ప్రభుత్వ విప్. చెన్నూర్ ఎమ్మెల్యే బాల్కసుమన్ మాజీ విప్ నల్లాల ఓదేలు, ఎమ్మెల్సీ పురాణం సతీష్, జడ్పీ ఛైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మిలు పాల్గొన్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బంద్ లో ఏఐటీయూసీ, ఐఎన్టీయుసి, సీఐటీయూ, హెచ్ఎంఎస్, టీబిజికెఎస్ యూనియన్ లు బంద్ లో పాల్గొన్నాయి
Also Read:రైతులను చర్చలకు ఆహ్వానించిన హోంమంత్రి అమిత్ షా
Also Read: రైతు ఉద్యమంలో రాజకీయ దళారులు:జీవీఎల్