- చమురు ధరలకు నిరసనగా బంద్
- బంద్ లో పాల్గొంటున్న వ్యాపార సంఘాలు
- స్తంభించిపోయిన రవాణా
రోజు రోజుకి పెరుగుతున్న పెట్రో, డీజిల్ ధరలు, జీఎస్టీ సవరణలకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చమురు ధరలతో పాటు పోటీగా పెరుగుతున్న గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. దీంతో నిత్యావసరాల ధరలకు కూడా రెక్కలు రావడంతో సామాన్యుడు బెంబేలెత్తుతున్నాడు. ఈ-వే బిల్లింగ్‌లకు నిరసనగా అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య ఇవాళ దేశవ్యాప్తంగా బంద్‌ను పాటిస్తున్నాయి. పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ కోట్లాది మంది రోడ్లపైకి వచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు.
Also Read: వ్యయ `వ్యూహం`లో ఉక్కిరిబిక్కిరి
దేశవ్యాప్తంగా ఇంధన ధరలు ఒకేలా ఉండాలని, ఈ-కామర్స్ సంస్థలపై నియంత్రణ, జీఎస్టీ సవరణలకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అఖిల భారత రవాణా సంక్షేమ సంఘం, హాకర్స్ సంయుక్త కార్యాచరణ సంఘం, హాకర్స్ జాతీయ కార్యవర్గం సహా పలు సంఘాలు బంద్‌కు మద్దతు ప్రకటించాయి. సంయుక్త కిసాన్ మోర్చాతో పాటు పలు ప్రజా సంఘాలు, వ్యాపార సంఘాలు మద్దతు పలికాయి. భారత్ బంద్‌లో భాగంగా చక్కాజామ్ కూడా నిర్వహిస్తున్నారు.
మద్దతు పలికిన పలు వ్యాపార సంఘాలు:
సీఏఐటీ పిలుపుతో దేశవ్యాప్తంగా 40వేల వ్యాపార సంఘాలు, 8 కోట్ల మంది వ్యాపారులు బంద్‌కు మద్దతు తెలుపుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా సుమారు 80 లక్షల రవాణా వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోనున్నాయి. దేశవ్యాప్తంగా 1500 ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరుగుతాయని వ్యాపార సంఘాలు తెలిపాయి.
Also Read: ఇంధన ధరలతో కూర’గాయాలు’
నిత్యవసరాలకు మినహాయింపు:
ప్రజలకు ఇబ్బంది కలగకుండా మందుల దుకాణాలు, పాలు, కూరగాయలు లాంటి నిత్యావసరాలకు మినహాయింపునిచ్చినట్లు భారత వ్యాపారుల సమాఖ్య స్పష్టం చేసింది. అయితే బంద్ కు అఖిల భారత వ్యాపార మండలి, భారతీయ ఉద్యోగ వ్యాపార మండలి దూరంగా ఉన్నాయి.