భగవద్గీత–100
ఏ క్షణం ఏం జరుగుతుందో మనకు తెలుసా? అంతా uncertainty. జీవితం పట్ల ఎన్ని ఊహలు. ఎన్ని ఆశలు. ఎన్ని కలలు. ఏ క్షణం ఏమి జరుగుతుందో మనకు తెలుసా? కాలము అనే నాళికలో మనకు తెలియకుండా నెట్టబడుతున్నాం. ఏ క్షణంలో ఏ మలుపు తిరుగుతుందో మనకెవరికీ తెలియదుగాక తెలియదు.
Also read: యుక్తాయుక్త విచక్షణ పరమావధి
మృత్యువు మన వెన్నెముకను ఆనుకునే ఉంటుందట. ఇన్ని అనిశ్చితత్వాలున్నాయి. ఈ పని చెయ్యాలా వద్దా అని ప్రతిక్షణం మనిషికి సందేహమే. అంతా uncertainty. ఈ uncertainty గురించే విచారించాడు అర్జునుడు.
యుద్ధము చేయడము సరైనదేనా? శ్రేష్టమైనదేనా? (is it correct?) బావా ఎవడుగెలుస్తాడో చెప్పలేము కదా! `ఇక ఈ యుద్ధము చేయడమెందుకు? జనాన్ని చంపడమెందుకు? నేను చేయనయ్యా` అని చతికిలపడతాడు.
న చైతద్విద్మః కతరన్నో గరీయో
యద్వా జయేమ యది వా నో జయేయుః
యానేన హత్వా న జిజీవిషామః
తేవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః
మరి మనమేం చెయ్యాలి?
Also read: అభ్యాసవైరాగ్యాలు
ఈ క్షణాన్ని సద్వినియోగం చేసుకోవటమే. చేసేపనిని చేయాలనుకున్నదానిని వెంటనే చేయడమే. ఏ క్షణంలో ఉన్నామో ఆ క్షణమే మనది. (నిజానికి అది కూడా మనదికాదు) అందుకే భగవానుడు అన్నది పని చేయడం వరకే నీ పని. దాని ఫలితం నీ చేతులలో లేదు. దానిని నీవే అనుభవిస్తావో కూడా తెలియదు.
భగవద్గీత ఎందుకు చదవాలంటే ఈ uncertainty of life కి జవాబు దొరుకుతుంది కనుక. ఆ జవాబు ఏమిటంటే ‘‘నిష్కామకర్మ.’’ ఆశించకుండా పనిచేయి. ఒత్తిడి అనేది శూన్యంలోకి ఎగిరిపోతుంది. ఒత్తిడి లేని బ్రతుకు కోసం భగవద్గీత. రోజూ గీతా పఠనం చేస్తే మన దృక్పథమే మారుతుంది.
Also read: అభ్యాసంద్వారా అంతరాల దర్శనం