- నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానా
- పాయింట్లను బట్టి ఇన్సూరెన్స్ ప్రీమియం పెంపు
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై ప్రభుత్వం కొరడా జులిపించనుంది. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు గురవుతున్న వారిని కఠినంగా శిక్షించేందుకు చట్టాలకు పదను పెడుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలకు మరింత కఠినతరం చేయనున్నారు. ఇక ముందు ఇష్టం వచ్చినట్లు వాహనాలను నడిపితే జరిమానాలను భారీగా వడ్డించనున్నారు.అవుటర్ రింగు రోడ్డుతో పాటు సిటీలోనూ కఠిన నిబంధనలకు అమలు చేయనున్నారు. హెల్మెట్, ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైడింగ్ సిగ్నల్ జంపింగ్ నిబంధనల్లో సమూల మార్పులు చేస్తున్నారు.
రూల్స్ బ్రేక్ చేస్తే బాదుడే
ట్రాఫిక్ రూల్స్ తు. చ తప్పక పాటించాలి. అలా చేస్తే బయటకు వచ్చిన వారంతా క్షేమంగా ఇంటికి చేరుకోవచ్చు. అయితే రోడ్లపైకి వస్తే మాత్రం కొంతమంది రూల్ప్ ని బ్రేక్ చేయడమే పనిగా డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వారితో పక్కన వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇదిగో ఇలాంటి వారికోసమే ఇపుడు ట్రాఫిక్ రూల్స్ ను పూర్తిగా మార్చివేశారు. ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్ డీఏ కొత్త రూల్స్ తీసుకువస్తోంది. ట్రాఫిక్ రూల్స్ ని బ్రేక్ చేసేవారికి పాయింట్లను కేటాయించనున్నారు.ఈ పాయింట్ల ఆధారంగానే ఇన్సూరెన్స్ ప్రీమియం లో హెచ్చుతగ్గులు ఉంటాయని ఐఆర్ డీఏ స్పష్టం చేసింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినవారికి ఇచ్చే పాయింట్లను బట్టి ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా అమాంతం పెరగనుంది. ఈ నిబంధనలకు మొదటగా ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాలలో అమలు చేయనున్నారు. తర్వాత దశలవారీగా దేశ వ్యాప్తంగా అమలు చేయనున్నారు.
ఇది చదవండి: ఫాస్ట్ ట్యాగ్ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం
అవుటర్ పై స్పీడ్ లిమిట్
అవుటర్ రింగు రోడ్డుపై స్పీడ్ లిమిట్ కు సంబంధించిన గుర్తులను వేశారు. ఇందులో భాగంగా 100 కిలో మీటర్ల గరిష్ట వేగానికి 1, 2 లైన్లు కేటాయించారు. 80కిలోమీటర్ల వేగానికి 3, 4 లైన్లను నిర్ణయించారు. గతంలో రోడ్డు పక్కన స్పీడ్ లిమిట్ సూచిస్తూ ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేసేవారు. మారిన నిబంధనలకు అనుగుణంగా ఇపుడు రోడ్డుపై కూడా స్పీడ్ లిమిట్ ను తెలియజేస్తూ అంకెలను ముద్రించారు. దీంతో అవుటర్ రింగు రోడ్డుపై వెళ్లేవారు ఎంత స్పీడు లో వెళ్లాలో నిర్ణయించుకుని ఆయా లైన్లను ఫాలో కావాల్సిఉంటుంది.
ఇది చదవండి: వాహనదారులారా బహుపరాక్ !