- సిరాజ్ కు అండగా నిలిచిన కెప్టెన్ కొహ్లీ
- పెద్దమనుషుల క్రీడలో చిల్లర తగాదా
భారత్- ఇంగ్లండ్ జట్ల ఆఖరిటెస్టు తొలిరోజు ఆటలోనే ఓ చిరువివాదం చోటు చేసుకొంది. భారత యువపేసర్ మహ్మద్ సిరాజ్ పైన ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ నోరుపారేసుకోడంతో కెప్టెన్ విరాట్ కొహ్లీ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.స్పిన్ బౌలింగ్ కు అనువుగా తయారు చేసిన మోతేరా పిచ్ పైన బ్యాటింగ్ కు దిగిన స్టోక్స్ కు సిరాజ్ బౌన్సర్ వేయటం వివాదానికి కారణమయ్యింది. స్టోక్స్ ఏకాగ్రతను దెబ్బ తీయటానికి సిరాజ్ ఓ షార్ట్ పిచ్ బాల్ తో బౌన్సర్ సంధించాడు. ఇది స్టోక్స్ లో అసహనానికి కారణంగా నిలిచింది. బ్యాట్ తో పని చెప్పకుండా స్టోక్స్ నోటికి పని చెప్పాడు. దూషణభూషణలతో సిరాజ్ పైన ఎదురుదాడికి దిగాడు.దీంతో చిర్రెత్తుకొచ్చిన సిరాజ్ తనను స్టోక్స్త్ తిడుతున్నాడంటూ తన కెప్టెన్ విరాట్ కొహ్లీకి ఫిర్యాదు చేసుకొన్నాడు. కొహ్లీ జోక్యం చేసుకొని స్టోక్స్త్ తో వాదనకు దిగడంతో ఫీల్డ్ అంపైర్ జోక్యం చేసుకొని సర్ది చెప్పడం ద్వారా అలజడి సద్దుమణిగింది.
Also Read: ఆఖరిటెస్ట్ తొలిరోజునా అదే సీన్
కొహ్లీ భాయ్ కి సిరాజ్ థ్యాంక్స్….
తనకు,స్టోక్స్ కు మధ్య జరిగిన స్వల్పఘర్షణలో విరాట్ భాయి జోక్యం చేసుకొని తనకు అండగా నిలవడం పట్ల సిరాజ్ సంతోషం వ్యక్తం చేశాడు పైగా స్పిన్ బౌలింగ్ పిచ్ పైన 14 ఓవర్లు వేసి 45 పరుగులకు 2 కీలక వికెట్లు పడగొట్టడం పట్ల సిరాజ్ సంతృప్తి వ్యక్తం చేశాడు.
Also Read: పిచ్ పైన రచ్చను ఆపండి- విరాట్
ఇంగ్లండ్ బ్యాటింగ్ వెన్నెముక జో రూట్ ను 5, వన్ డౌన్ బెయిర్ స్టోను 28 పరుగుల స్కోర్లకు అవుట్ చేయడం వెనుక వ్యూహం ఉందని సిరాజ్ చెప్పాడు. రూట్, బెయిర్ స్టో బ్యాటింగ్ వీడియోలను తాను చూసి అవుట్ స్వింగర్ల నడుమ ఇన్ స్వింగర్లు వేసి పెవీలియన్ దారి పట్టించగలిగానని వివరించాడు.