Sunday, December 22, 2024

విశ్వాసాలు — చట్టం

అజీబ


అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది, ఇష్టం మనిషిని ఏదైనా చేయిస్తుంది, ఆశ మనిషిని బ్రతికిస్తుంది, ప్రేమ జీవితాన్ని శాసిస్తుంది  … అని ఎక్కడో చదివాను భవిష్య … ఒకదానికి ఒకటి పొంతనే లేదనిపిస్తుంది .. వింటున్నావా,

ఫోన్ లో మాట్లాడుతున్నాను పతంగ్ …

నేను పతంగ్ ను కాను .. రాధా రమణ ను .. పతంగ్ వచ్చి అప్పుడే వెళ్లాడా, నేను వచ్చే వరకు ఉంటాను అన్నాడు .. కావ్య వచ్చిందా .. , ఫోన్ లో ఎవరితో మాట్లాడుతున్నావు .. అంత సీక్రెట్ గా మాట్లాడుతున్నావు …?

రమణ .. వస్తున్నాను ఆగు . కావ్య , పతంగ్ ఇద్దరూ బయటకు వెళ్లారు, నీవు వచ్చేలోపు వచ్చేస్తామన్నారు .. లేట్ ఎందుకు అయ్యిందో కనుక్కోనా …

అవసరం లేదు .. ముందు ఈ విషయం చెప్పు

ఏ విషయం ..

అదే రాజ్ గురించి .. ఆఫీస్ అంతా గోల గోల గా ఉంది. అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది అనేటందుకు మంచి ఉదాహరణకు  రాజ్ ను చూపవచ్చు   …

 నేను ఒక విషయం అడుగుతాను రాధ,  ఏం అనుకోవు కదా …

ఏం ఆలా అడుగుతున్నావు .. కొత్తగా, సరే అడుగు భవిష్య

నన్ను పెళ్లి చేసుకుంటావా … స్నేహాన్ని ప్రేమగా మార్చుకుందాము, మనం ఎందుకు పెళ్లి చేసుకోకూడదు .. ఈ రోజు నా మనసేమి బాగా లేదు .. మనసులో గుబులు … బాధ … హృదయం చాలా “పెయిన్” గా ఉంది …

భవిష్య మన ఇద్దరి మధ్య స్నేహం తప్ప మరోటి లేదు … నేను పెళ్లి చేసుకోవద్దని నిర్ణయం తీసుకున్నాను … గతం లో నా క్లాసుమేట్ ను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను … తన సమస్యలు తనవి.. ఇంట్లో వెంటనే పెళ్లి చేస్తామంటున్నారు .. తనపై ప్రేమ ఉంటే .. వెంటనే పెళ్లి చేసుకొమ్మని వత్తిడి చేసింది … ఎలాంటి సంపాదన లేకుండా పెళ్లి అంటే మాటలా అన్నాను .. అంతే  వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోయింది. నా కార్యక్రమాలు నాకున్నాయి. ప్రజలను ఏకం చేయాలి .. వారి బ్రతుకులు ఇంత బీదరికంలో ఎందుకున్నాయో, వాటికి కారకులు పాలకుల పాలనా విధానం అనే విషయం పై  వారిలో చైతన్యం తీసుక వచ్చేటందుకే ఈ జీవితం అంకితం … నీకో విషయం తెలుసా … నీలానే కొన్ని సందర్భాలలో ఆలోచించేవాడిని నిన్ను పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటది అనుకునే వాడిని … ప్రేమ వేరు, స్నేహం వేరు. మన మధ్య ఉన్నది స్నేహమే. నీపై ఎప్పుడూ ఇష్టం, కోరిక కలగలేదు. ప్రేమలో ఈ రెండూ కలుగుతాయి .. స్నేహం లో కలుగవు … నీవు ఎప్పుడూ అడిగేదే … నేను ఎప్పుడూ చెప్పేదే అని  అనుకుంటున్నావా ?

భలే కనిపెట్టావే … నీ ప్రజా చైతన్యం ఎంతవరకు వచ్చింది. ఆడవాళ్లను కూడా చైతన్య పరుస్తున్నారా ? చైతన్యం అనే పదంకు అర్ధమే మారుతున్నది. ఇది అవగాహన లోపానికి సూచన అంటాను .

చైతన్యం పదానికి అర్ధం ఒకటే ఉంది, దీనికి అర్ధం మారేది ఏం ఉంది భవిష్య.

మనం వేసుకునే డ్రసులలో, మాటలలో మాత్రమే చైతన్యం ఉంది కానీ, ఆలోచనలలో ఎక్కడ చైతన్యం ఉంది చెప్పు. హలొ, హాయ్ అని, రెండు సార్లు ఆడ మగ కలిసి ఛాయ్ లు తాగినంత మాత్రాన చైతన్యం వచ్చినట్లా? ఆడ-మగ ల మధ్య “బంధం” గురించి ఒక్కమాటలో చెప్పు రాధ .. నీవే ఉన్నావు, నీ గురించే చెప్పు పెళ్లిని నిరాకరిస్తావు, ఏ అమ్మాయన్న వచ్చి ప్రపోజ్ చేస్తే పది మందికి చెప్పుకుంటావు, నీవు నాకు స్నేహితుడివే ఉండవచ్చు కానీ .. నీలో ఉన్నది,  నీ ఆలోచనలను  “చైతన్యం” గా ఉన్నాయి అందామా చెప్పు?

భవిష్య, స్త్రీ పురుష సంబంధాలను, ఆర్ధిక సంబంధాలను, సాంఘిక సంబంధాలను, రాజకీయ సంబంధాలను అర్ధం చేసుకునేటందుకు ఆయా కాల పరిస్థితులలో … మార్క్స్ , ఎంగెల్స్ , లెనిన్ , గాంధీ , అంబెడ్కర్, రంగనాయకమ్మ, ఓల్గా.. వగైరా వగైరా  మహా పెద్దవాళ్ళు రాసిన సిద్ధాంతాలను అర్ధం చేసుకొని అన్వయించుకోవాలి. అన్వయించుకోవటం, ఆలోచించటం … వారి వారి చైతన్యం ను బట్టి ఉంటుంది. ఆడవాళ్ళ పరిస్థితినే తీసుకుందాము .. ఒకప్పుడు ఇంటికే పరిమితమై ఉండే వారు, మనుషులుగానే గుర్తించని కాలం ఉండే, ఇంకా కొన్ని దేశాలలో ఓటు హక్కుకు అనర్హురాలిగా పరిగణించే వారు. ఇంకా, ఇద్దరు ఆడవాళ్లు ఒక మగాడితో సమానం అని చట్టాలలో ఉండేది. ఎక్కడైనా న్యాయస్థానాలలో సాక్ష్యం చెప్పాలి అంటే ఆడవాళ్ళూ ఇద్దరు, మగాడు అయితే ఒక్కరు అని ఉండే .. అది రాను రాను మారింది . చైతన్యం అంటేనే మార్పు .. మార్పు అంటేనే దేశ ప్రగతి. వచ్చిన చిక్కల్లా మార్పును ఆహ్వానించే వాళ్ళు తగ్గుతున్నారు … ఎవరికి వారు .. నీవు చెప్పినట్లే వివిధ అర్ధాలను “చైతన్యం” కు ఆపాదించుకుంటున్నారు .. అదే మార్పు .. అదే చైతన్యం అనుకుంటున్నారు. అర్ధాలను వెతుక్కోవటం కాదు … అది చైతన్యం కాదు .. మార్పు కాదు … అర్ధాలు వేరే వేరేగా ఇస్తున్నారు అని అనుకోవటం శుద్ధ దండగ . ప్రభుత్వాలు రిజర్వేషన్స్ రూపం లో, పథకాల రూపం లో ప్రజల సమస్యలను తీరుస్తున్నాము అని ప్రచారం చేసుకోవటం, ఎన్నికల సమయం లో ఇవే ప్రధాన ఎజండాగా ముందు పెట్టుకొని ప్రజల దగ్గెరకు వెళ్లి ఓట్లు అడుగుతారు. నాయకులు  చైతన్యం /మార్పు కోరుతున్నారు అనుకోవటం… ప్రజలు చైతన్య వంతంగా ఆలోచిస్తున్నారు కాబట్టే అన్ని పార్టీల దగ్గెర డబ్బులు తీసుకుంటున్నారు. మరియు  ఓటు ఎవరికి వేయాలినో వారికి వేస్తున్నారు అని అనుకోవటం … నాయకుల ప్రచారం, ఓటును అమ్ముకోవటం.. ఈ రెండిటిని ఒకే గాట మీద చూడటం చైతన్యం కాదు .. అలానే స్త్రీలు ఆధునికంగా అలంకరించుకున్నంత మాత్రాన ఆడవాళ్ళ సమస్యలు తీరినట్లు కాదు .. చైతన్యం ఉన్నట్లూ కాదు, ఆధునికంగా అలంకరించుకోనంత మాత్రాన వారిలో చైతన్యం లేనట్లూ కాదు. మతం “విశ్వాసాల” ముసుగులో కర్మ సిద్ధాంతంలో భాగం అంటూ ఆర్ధిక-సాంఘిక-సామాజిక-రాజకీయ పరంగా ప్రజలను దోచుకుంటున్నారో,  ఈ విధానాన్ని ఆపేసేటందుకు వేసే అడుగులు చైతన్యం తో కూడిన  మార్పుకు సంకేతం … 

రమణి వచ్చేసాడా ? అంటూ పతంగ్ , కావ్యలు ఒకేసారి అడుగుతూ సోఫా  పై కూర్చున్నారు .

ఎప్పుడో వచ్చాడు రాధ, ఇప్పుడే వస్తాము అంటూ వెల్తిరి,  ఇంత లేట్ అయ్యింది ఎందుకు .. 

రాజ్ ఆఫీస్ లో ఏదో గొడవ అయ్యింది అంటే అక్కడి వరకు వెళ్లి వచ్చాము అన్నది కావ్య .. 

రాజ్, ఆఫీస్ కు వారం రోజుల నుండి రావట్లేదు అని చెప్పారు. అంత పెద్ద సమస్యను మనకు ఎవ్వరికీ చెప్పలేదు ఎందుకు అన్నాడు పతంగ్ .. 

రాజ్ గురించే మాట్లాడేటందుకు  మనమందరం ఈ రోజు కలిసింది. రాజ్  ఇప్పుడు వస్తాను అన్నాడు అన్నది భవిష్య … 

రాజ్ ఎందుకు అండర్ గ్రౌండ్ అయ్యాడు … పోలీసులు అరెస్ట్ చేస్తారనా? అంత పెద్ద నేరం ఏం చేసాడు? అని అడిగింది కావ్య . 

ఆఫీస్ లో షీబ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుందాము అని అడిగినందుకు ఈ గొడవ వచ్చింది. షీబా – రాజ్ లు మంచి స్నేహితులే. షీబ కు కూడా రాజ్ అంటే ఇష్టమే, కానీ … రాజ్ వాళ్ళు యేసు ప్రభువును పూజిస్తారు, షీబ వాళ్ళు మేరీ మాతను పూజిస్తారు. ఇక్కడే గొడవ మొదలు అయ్యింది. చాలా మూర్ఖంగా షీబ ప్రవర్తన ఉంది. ఆమె తల్లి తండ్రులది ఇంకా మూర్ఖంగా ఉంది అన్నాడు రాధా రమణ. 

నిజం ఏంటో వివరించు రమణ అన్నాడు పతంగ్ . 

ఇప్పుడు ఏం చేయాలో అదీ చెప్పు అన్నది కావ్య .. 

మీ ఇద్దరి పెళ్లి ఎప్పుడు అని అడిగాడు రాధ రమణ … 

ఇప్పుడు వాళ్ళది సమస్య కాదు .. ముందు రాజ్ గురించి చెప్పు అన్నది భవిష్య .. 

ఓకె ఓకె … ఆడపిల్లను పెళ్లి చేసుకొమ్మని వేధిస్తున్నట్లు, రేప్ చేయబోయినట్లు … అనే ఆరోపణలతో,  షీబ తో ఆమె తల్లి తండ్రులు రాజ్ పై కేసు పెట్టించారు. 3 ఏళ్ళ నుండి షీబ- రాజ్ లు మొదట్లో స్నేహితులు, ఆ తరువాత ప్రేమికులు. ఒకరి పై ఒకరు కొన్ని  నమ్మకాలను, విశ్వాసాలను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ 3 ఏళ్ళ ప్రయాణం లో. కాల క్రమములో ఆలోచనలలో మార్పు రావచ్చు. షీబ చాలా సార్లు “మనం పెళ్లి చేసుకుంటే ” ఎలా ఉంటది అని అడిగేది రాజ్ ను. రాజ్ సమాధానం ఎప్పుడూ ఇవ్వలేదు. ఒక 20 రోజుల కిందట రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకుందాము అనే ప్రపోజల్ షీబ ముందు రాజ్ పెట్టాడు. ప్లాన్ కూడా చెప్పాడు. ఇక్కడనే బెడిసి కొట్టింది. ఇద్దరు మంచి ఉద్యోగం చేసుకుంటున్నారు .. ఒకరిపై ఒకరికి గౌరవం, ప్రేమ ఉంది. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేంత పరిస్థితులు ఏం లేవు. క్రిస్టియానిటీలో , ఇస్లామ్ లో స్త్రీల కు సంబంధించిన సంస్కరణలు రావలసిన అవసరం ఎంతో ఉంది. మిగతా మతాలలో ఆడవాళ్ళ గురించి చాలా గొప్పగా ఉంది అనటం లేదు. మతం పేరుతో, సంప్రదాయం పేరుతో స్త్రీలపై, స్త్రీల విషయంలో దారుణాలు ఇప్పటికీ జరుగుతున్నాయి. వెనకటి రోజులలోను, ఇప్పుడు, ఎప్పుడూ స్త్రీలపై చెడు ప్రచారాలు, అణచివేతలు ఆపకుండా సమాజంలో జరుగుతూనే ఉన్నాయి .. వీటిని ఎదుర్కొంటూ, చైతన్యంతో ముందుకు.. .. సమాజం అభివృద్ధి వైపు ప్రయాణించాలి. కానీ మొన్నటికి మొన్న … సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం మహిళా సైనికుల పదోన్నతుల విషయం పై ఒక అఫిడవిట్ దాఖలు చేసింది … ఆ అఫిడవిట్ మత “విశ్వాసాలను” బేస్ చేసుకొని [అన్ని మతాలలో మహిళల పట్ల తక్కువ చూపే ఉంది] తయారు చేసినట్లు ఉంది. ప్రభుత్వాలే మహిళల విషయం పై ఇంత డొల్లతనంగా ఉంటే సామాన్య ప్రజలు మహిళల పట్ల ఇంకా ఎట్ల ఉంటారు?  షీబ కుటుంబీకులు ఈ సమాజంలో భాగస్తులే కదా. వాళ్ళు ఏదో జరగకూడనిది జరిగిపోయినట్లు చాలా  దారుణంగా ఆలోచిస్తున్నారు. వెనకటి కాలంలో ఇంత  విజ్ఞానం  అభివృద్ధి కాని కాలం. అందుకే “అసత్యం తో కూడిన కొన్ని విశ్వాసాలు” ఉన్నాయి, దీన్ని కాదనలేము.  వాటిని పగుల గొట్టి దీనిమీదనే సమాజం నిర్మాణం జరుగుతుంది. అయితే వాటితోనే నిర్మాణం కాదు. అయినప్పటికిని చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు, చైతన్యవంతులం అనుకుంటున్నా వాళ్ళు ఎక్కువ లో ఎక్కువ మంది మూర్ఖంగా ఆలోచిస్తున్నారు. ఆ కోవకు చెందిన వాళ్ళే షీబ కుటుంబీకులు. కాబట్టి షీబ వాళ్ళ కుటుంబ పెద్దలతో మాట్లాడినాను .. షీబ ను రాజ్ తో పెళ్లి జరిపించే ఇష్టం లేక పోతే పెళ్లి  మానెయ్యండి, తప్పుడు కేసులు పెట్టటం పద్ధతి కాదు అని షీబ తల్లి తండ్రి కి నచ్చ చెప్పే ప్రయత్నం చేసాను, కాని వినటం లేదు. వారి చర్చి ఫాదర్ తో మాట్లాడిన .. ఆయన ఇంకా పెద్ద మూర్ఖుడిలా ఉన్నాడు .. మగాడి పక్కటి ఎముకతో స్త్రీ ని  ప్రభువు పుట్టించెను .. “దేవుడు వారి ఇద్దరి సహచర్యం అంగీకరించటం లేదు. మన గుణ, శీలమును మాత్రమే దేవుని యొక్క అంగీకారంను తెచ్చును .. మనము ఎంత పరిచర్య చేసామనేది మరచి … పాపము విషయం లో మన తలంపులు గురించి ఆలోచించాలి ”  … అని ఆ చర్చి ఫాదర్ చెప్పారు. ఏ మత గ్రంధమైనా ఒకప్పటికే సరిపుచ్చుకోవచ్చు … ఇప్పటికీ అవే మత గ్రంధాల ప్రకారం జీవించాలి అంటే ఎలా?.  రాజ్యాంగం, చట్టం నేడు ఉన్నాయి. వీటి ప్రకారమే సమాజం నడవాలి .. వీటిని అమలు చేయాలి, కాని వీటిని అమలు చేయటం లేదు. ఎవరి దారిలో వారు పోతున్నారు. మనం చేయవలసింది ముందు ఏమని ఫిర్యాదు ఇచ్చారో తెలుసుకుందాము … రాజ్ ను కాపాడుకుందాము .. ఇప్పుడు కావలసింది … నమ్మకాలు , విశ్వాసాలు కాదు … వాస్తవాలు..  దీనికి బేస్ నిజాలు, ఖచ్చితమైనవి,   సత్యమైనవి, ఏ తప్పూ చేయలేదు అని తేల్చి చెప్పేది మనం గుర్తించాలి. సత్యం ఎల్లప్పటికీ శాశ్వతమైనది… కొన్ని కేసులలో నిజ నిర్ధారణ అంటాము చూడు, అది మనం ఇప్పుడు చేయాలి. వారి  మూర్ఖత్వాలకు మనం  కామా పెట్టాలి … మనస్సును అదుపు చేసే మూఢ విశ్వాసాల నుంచి బయటకు వచ్చి, స్వతంత్ర యోచన చేయటమే మానవాభివృద్ధికి సాధ్యం.  ఆడవాళ్లు తక్కువ, మగ వాళ్ళు ఎక్కువ అనే ఆలోచనలను తరిమి కొట్టవలసిందే.

నీవు చెప్పే విషయాలతో మాకెవ్వరికి విభేదం లేదు, మత గ్రంధాలు స్త్రీలతో ఎలా మెలగాలి, వారి పట్ల ఎలా ఉండాలి, వారిని ఏ విధంగా చూడాలి, మత గ్రంధాలలో స్త్రీల స్థానం, స్త్రీల పట్ల సమాజం దృష్టి, వివిధ కోణాలలో  చెప్పిన విషయం అర్ధం అయ్యింది. ఇప్పుడు రాజ్ కు ఎలాంటి సహాయం వేంటనే అందించగలమో .. ఈ విషయం కొంచెం స్పష్టంగా ఉండాలి అంటాను అన్నది కావ్య ..

రాజ్ వచ్చాక, తీసుక వెళ్లి పోలీసులకు అప్పచెపుదాము … సత్యం ఏంటో కనుక్కొని చట్టాన్ని అమలు చేయమని చెపుదాము … ఏం జరుగుతదో చూద్దాము … పోలీస్ స్టేషన్ కు వెళ్లే  ప్రతీ  కేసు “నిజాల ” పై ఆధార పడి లేవు .. సాక్ష్యాలు కూడా ఉండాలి, సాక్ష్యాలే ముఖ్యం. ఈ మొత్తం ప్రాసెస్ లో కొంత మేర మనం బదనామ్ అవుతాము .. అయినా వెనక్కి తగ్గేది లేదు … ఏమంటావు భవిష్య అన్నాడు రాధ రమణ. 

మనల్ని అర్ధం చేసుకొనే వారు కొందరైనా ఉంటారు .. వారికి చెపుదాము, ప్రతి చిన్న విషయాన్ని అపార్ధం చేసుకొనే వారు చాలానే ఉంటారు … వారితో డిస్కస్ చేయక పోవటం ఉత్తమం … రాధ చెప్పిన విషయాలు .. మనం ముందుగా “చట్టాన్ని గౌరవించాలి” అని చెపుతున్నట్లు ఉంది, రాజ్ ను సరెండర్ చేద్దాము .. మరొకసారి అందరం షీబ తోను, ఆమె కుటుంబీకులతోను మాట్లాడుదాము .. విల్ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ అన్నది భవిష్య …

సో, రాజ్ రావటమే లేట్ కదా అన్నారు పతంగ్, కావ్యలు .      

రచయిత మొబైల్: 9440430263

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles