నేను క్షత్రియుడ్ని… అందుకు నేను గర్వపడతాను…అంటే నేను కాపులనో, కమ్మోళ్లనో వ్యతిరేకిస్తున్నట్టు కాదు…
నేను హిందువును… అందుకు కూడా నేను గర్వపడతాను… అంటే నేను ముస్లిములనో, క్రిస్టియన్లనో ద్వేషిస్తున్నట్టు కాదు.
నేను గోదావరి జిల్లా వాడ్ని… అందుకు కూడా నేనెంతో గర్వపడతాను… అంటే నేను కృష్ణా జిల్లానో, కర్నూలు జిల్లానో వ్యతిరేకిస్తున్నట్టు కాదు…
నేను ఆంధ్రా వాడిని… అందుకు కూడా నేను మరెంతో గర్వపడతాను అంటే నేను తెలంగాణానో, తమిళనాడునో ద్వేషిస్తున్నట్టు కాదు…
నేను సౌత్ ఇండియన్ ని… అందుకు కూడా నేను ఎంతగానో గర్వపడతాను… అంటే నేను నార్త్ ఇండియన్స్ నో, ఈస్ట్ ఇండియన్స్ నో, వ్యతిరేకిస్తున్నట్టు కాదు…
నేను భారతీయుడ్ని… అందుకు నేను మరెంతగానో గర్వపడతాను… అంటే నేను పాకిస్తాన్ నో, చైనా నో ద్వేషిస్తున్నానని కాదు.
ఎందుకంటే నేను “మనిషి”ని…
జాతి కన్నా, ప్రాంతంకన్నా, రాష్ట్రం కన్నా, దేశం కన్నా, కులం కన్నా, మతం కన్నా “మానవత్వం” గొప్పదని చిన్నప్పుడు మా అమ్మ, పెద్దయ్యాకా నా దేశం… మన పవిత్ర భారతదేశం నాకు నేర్పాయి.
జై హింద్… భారత మాతకు జై.