కళ్లు చూస్తాయి
మస్తిష్కం గ్రహిస్తుంది
మనసు అర్థం చేసుకుంటుంది
ఆలోచనలు చెలరేగుతాయి
ఇంకా ఇంకా తెలుసుకునే ప్రయత్నం
నిరంతరం సాగుతూనే ఉంటుంది.
కనిపించేది ఒకటే అయినా
ఒక్కొక్కరికి ఒక్కక్క అనుభూతి
నీకు అందం నాకు వికారం
నీకు రుచి నాకు డోకు
నీ ఇష్టం నాకు కష్టం
ఎందుకిలా?
అందం, రుచి, ఇస్టం
కనిపించే వస్తువులో కాదు
చూసే మనిషిలో ఉందా?
కంటికి కనిపించేది
నిజమంటుంది భౌతిక శాస్ట్రం
నిజం కాదంటుంది వేదాతం
నిజం కాదనే అన్నాడు ఐన్స్టీన్
విషయం తేల్చడానికి పురోహితుడై
పెళ్ళి చేశాడు భౌతికానికి, వేదాంతానికి
వారి బిడ్డే మనస్తత్వ శాస్త్రం
అది కంటికి వస్తువుకు మధ్య
మనసు పొర ఉందంటుంది.
పుట్టుకతో జీన్స్ వారసత్వం
కాకపోతే ‘ప్రారబ్ధం‘ తెచ్చుకుంటాం
ప్రపంచంతో కలిసేకొద్దీ అలవాట్లు, ఆలోచనలు, అభిప్రాయాలు
పెరుగుతూ వస్తాయి వయసుతో
పుటక, సమాజం రెండూ కలిసి
చెక్కుతాయి మన వ్యక్తిత్వాన్ని.
ప్రపంచం కనిపిస్తుంది మనకు
వ్యక్తిత్వమనే ఈ రంగు కళ్ళద్దాలతోనే.
రంగుల్లేకుండా నిజం చూడాలంటే
వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోవాలి
అంటే నేర్చుకున్నదంతా వదిలించుకోవాలి
అప్పడు అన్నీ రంగులు కలిసిపోయి
విషయం తేటతెల్లమవుతుంది
మన ఙ్ఞాన నేత్రానికి.
Also read: భావదాస్యం
Also read: స్వేచ్చాజీవి
Also read: నేనెవరు?
Also read: స్వచ్ఛభారత్
Also read: అమ్మ – నాన్న