—————————-
( From ” The Wanderer” by KAHLIL GIBRAN)
(తెలుగు సేత: Dr.C.B. Chandra Mohan)
4. అంబరాలు
——————–
ఒకానొక రోజు ‘ సౌందర్యము ‘ మరియు ‘అనాకారి ‘ ఒక సముద్రపు ఒడ్డున కలుసు కున్నారు. ఇద్దరూ సముద్రం లో స్నానమాడడానికి
సిధ్ధ మయ్యారు.
ఇద్దరూ బట్టలు విప్పి, నీళ్లలో ఈదారు. కొంత
సేపటి తరువాత ‘ అనాకారి ‘ ఒడ్డుకి వచ్చి ‘సౌందర్యం’ బట్టలు వేసుకొని వెళ్ళిపోయింది.
‘సౌందర్యం’ కూడా ఒడ్డుకి వచ్చి, తన దుస్తులు
లేకపోవడం చూసింది. నగ్నంగా ఉండడానికి సిగ్గు
పడింది. చేసేదేమీ లేక ‘ అనాకారి వదిలి వెళ్ళిన
బట్టలు వేసుకొని వెళ్లి పోయింది.
అప్పటినుండి , ఈ రోజు వరకు జనమంతా
( ఆడా, మగా) — ‘ సౌందర్యము’, ‘ అనాకారి’లను, ఒకరిని చూసి మరొకరుగా పొరపాటు పడుతూనే ఉన్నారు !
‘ సౌందర్యము’ యొక్క ముఖము మునుపు చూ సిన కొంత మంది మాత్రం ‘ అనాకారి ‘ బట్టల్లో ఉన్న
‘సౌందర్యాన్ని ‘ గుర్తించ గలిగారు. అలాగే , ‘ సౌందర్యం ‘ దుస్తుల్లో ఉన్న ‘ అనాకారి ‘ రూపం కొంతమందిని మోసం చెయ్యలేక పోయింది.