- ఆసియా క్రికెట్ మండలి చైర్మన్ గా జే షా
కేంద్ర హోంమంత్రి తనయుడు, భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జే షాకు అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటి వరకూ భారత క్రికెట్ కార్యకలాపాలకు మాత్రమే పరిమితమైన జే షా..ఇక నుంచి ఆసియా దేశాల క్రికెట్ మండలి భాద్యతలను సైతం నిర్వహించనున్నారు.
ఆసియా క్రికెట్ మండలి చైర్మన్ గా జే షా ఎంపికయ్యారు. ఇప్పటి వరకూ బంగ్లాదేశ్ కు చెందిన నజ్ముల్ హసన్ పాపన్ ఆసియా క్రికెట్ మండలి చైర్మన్ గా వ్యవహరించారు. ఇక నుంచి నజ్ముల్ కు బదులుగా జే షా ఆ విధులు నిర్వర్తించనున్నారు. 32 సంవత్సరాల జే షా రెండేళ్ల క్రితమే బీసీసీఐ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు గుజరాత్ క్రికెట్ సంఘం కార్యదర్శిగా విధులు నిర్వర్తించిన అనుభవం షాకు ఉంది.
Also Read : 2020-21 రంజీ సీజన్ హుష్ కాకి
కరోనా వైరస్ సమయంలోనే…గల్ఫ్ దేశాలు వేదికగా రెండుమాసాలపాటు ఐపీఎల్ 13వ సీజన్ పోటీలు విజయవంతంగా నిర్వహించడంలో జే షా ప్రధానపాత్ర వహించారు.
Also Read : భారత అంపైర్లకు భలే చాన్స్
ఆసియా ఖండ దేశాలలో క్రికెట్ అభివృద్ధి కోసం జే షా తనవంతుగా కృషి చేయనున్నారు. ఆసియా క్రికెట్ మండలి ఆధ్వర్యంలోనే పురుషుల, మహిళల ఆసియాకప్ క్రికెట్ టోర్నీలు నిర్వహిస్తూ వస్తున్నారు.
Also Read : దేశవాళీ టీ-20 లో టైటిల్ సమరం