- నిబంధనలు సడలించాలంటూ క్రికెట్ ఆస్ట్రేలియాకు లేఖ
ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా ఆస్ట్ర్రేలియా- భారత్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగుమ్యాచ్ ల సిరీస్ లోని ఆఖరి టెస్ట్ వేదిక…రెండుదేశాల క్రికెట్ సంఘాలకు సమస్యాత్మకంగా మారింది.
బ్రిస్బేన్ గబ్బా స్టేడియం వేదికగా జనవరి 15 న ప్రారంభకావాల్సిన ఆఖరి టెస్ట్ మ్యాచ్ కు క్వారెంటెయిన్ , బయోబబుల్ నిబంధనలు ప్రతిబంధకంగా మారాయి. ప్రధానంగా భారత క్రికెటర్లు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
న్యూసౌత్ వేల్స్, క్వీన్స్ లాండ్ రాష్ట్ర్ర్లాలలో కరోనా వైరస్ మరింతగా ప్రబలడంతో ఆయా రాష్ట్ర్రప్రభుత్వాలు క్వారెంటెయిన్ నిబంధనలను మరింత కట్టుదిట్టం చేశాయి. దీనికితోడు భారత క్రికెటర్లు సైతం సాధారణ పౌరుల మాదిరిగానే నిబంధనలను పాటించాల్సిన పరిస్థితి ఎదురయ్యింది.
ఇది చదవండి: కంగారూలకు భారత్ పగ్గాలు
ఆఖరి టెస్టు వేదిక బ్రిస్బేన్ లో భారత క్రికెటర్లు విడిది చేసే సమయంలో బయోబబుల్ నిబంధనలను తుచ తప్పక పాటించాల్సి ఉంది. అంతేకాదు…భారతజట్టు సభ్యులంతా వేర్వేరు అంతస్తులలో బస చేయటం, భోజనం చేసే సమయంలోనూ వేర్వేరుగా ఉండటం అసౌకర్యంగా మారింది. అజింక్యా రహానే నాయకత్వంలోని భారతజట్టు సభ్యులు ఈ నిబంధనల పట్ల తీవ్రఅసంతృప్తితో ఉన్నారు. తమ ఇబ్బందులను బీసీసీఐ ముందు ఏకరువు పెట్టారు.
దీంతో భారత క్రికెట్ బోర్డు రంగంలోకి దిగి క్రికెట్ ఆస్ట్ర్రేలియాకు లేఖరాసింది. నిబంధలు సడలించాలని, తమజట్టు సభ్యులంతా ఒకేచోట విడిది చేసేలా ఏర్పాట్లు చేయాలని,ఒకే హాలులో కలసి భోజనం చేసేలా అనుమతించాలంటూ కోరింది.తమ షరతులకు క్రికెట్ ఆస్ట్ర్రేలియా ఆమోదం తెలిపితేనే ఆఖరిటెస్టులో పాల్గొంటామంటూ స్పష్టం చేసింది. మరి ఆస్ట్ర్రేలియా క్రికెట్ బోర్డు ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.
ఇది చదవండి: సిడ్నీలో భారత్-కంగారూ టగ్ -ఆఫ్- వార్