- రహానేసేనకు 5 కోట్ల నజరానా
ఆస్ట్ర్రేలియాను ఆస్ట్ర్రేలియా గడ్డపై ఓడించడం ద్వారా రెండోసారి టెస్టుసిరీస్ నెగ్గిన అజింక్యా రహానే నాయకత్వంలోని భారతజట్టు సభ్యులకు బీసీసీఐ బోనస్ ప్రకటించింది. ప్రతికూల పరిస్థితులను అధిగమించి, కంగారూగడ్డపై నేలవిడిచి సాము చేయటమే కాదు 2-1తో టెస్టు సిరీస్ నెగ్గడం పట్ల బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జే షా సంతోషం వ్యక్తం చేశారు.భారత క్రికెటర్లకు 5 కోట్లరూపాయలు నజరానాగా ఇస్తున్నట్లు ప్రకటించారు.
నరేంద్ర మోడీ ప్రశంసలు
ఆస్ట్రేలియాతో ముగిసిన నాలుగుమ్యాచ్ ల టెస్టు సిరీస్ ను 2-1తో నెగ్గిన భారతజట్టు సభ్యులను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. బ్రిస్బేన్ టెస్టులో తుదివరకూ పోరాడి సాధించిన విజయం అపూర్వమని కొనియాడారు. భారత క్రికెటర్లకు తమ అభినందన సందేశాన్నిపంపారు.
Also Read : భారత క్రికెట్లో సరికొత్త చరిత్ర
గవాస్కర్, సచిన్, వీరూ హ్యాట్సాఫ్
కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడినా….కెప్టెన్ విరాట్ కొహ్లీ అందుబాటులో లేకపోయినా…రహానే నాయకత్వంలో భారతజట్టు సాధించిన అపురూప విజయానికి క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, సునీల్ గవాస్కర్ హ్యాట్సాఫ్ చెప్పారు. భారత క్రికెట్ అభిమానులు కలకాలం గుర్తుంచుకొనే విజయం అంటూ ప్రశంసలతో ముంచెత్తారు.