• బంగ్లాదేశ్ స్వాతంత్ర్యానికి 50 వసంతాలు
• పాక్ నుంచి స్వాతంత్ర్యం పొందిన బంగ్లాదేశ్
భారత 72 వ రిపబ్లిక్ డే ఉత్సవాలలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఈ సారి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఓ ప్రత్యేకతను సంతరించుకున్నాయి. తొలిసారిగా బంగ్లాదేశ్ సైన్యం ఢిల్లీలోని ఎర్రకోటపై పరేడ్ లో పాల్గొంది. భారత్ సాయంతో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేవ్ స్వాతంత్ర్యం పొంది 50 ఏళ్లు అయింది. 1971లో జరిగిన యుద్ధం ద్వారా బంగ్లాదేశ్ కు పాకిస్తాన్ నుంచి విమోచన లభించింది. అప్పటి నుంచి బంగ్లాదేశ్ భారత్ కు మిత్రదేశంగా ఉంటూ వస్తోంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని 122 మంది సైనికులతో కూడిన బంగ్లాదేశ్ బృందం భారత సైన్యంతో కలిసి కవాతులో పాల్గొంది. బంగ్లాదేశ్ త్రివిధ దళాలకు చెందిన ఈ బృందానికి మొహత్సిమ్ హైదర్ చౌదరి నాయకత్వం వహిస్తున్నారు.
ఇది చదవండి: రాజకీయ రణ’తంత్రం’ గా మన ప్రజా ‘గణతంత్రం’!
విదేశీ సైన్యానికి భారత రిపబ్లిక్ పరేడ్ లో స్థానం కల్పించడం ఇది మూడోసారి. గతంలొ 2016 లో ఫ్రాన్స్ సైన్యం, 2017లో యూఏఈ సైనికులు ఎర్రకోటపై భారత త్రివిధ దళాలలతో కలిసి మార్చ్ ఫాస్ట్ లో పాల్గొన్నారు. కవాతులోని మొదటి ఆరువరుసల్లో బంగ్లాదేశ్ సైన్యం, తర్వాతి రెండు వరుసల్లో నావికాదళం, ఆ తర్వాతి రెండు వరుసల్లో బంగ్లాదేశ్ వైమానిక దళం పాల్గొన్నాయి.