ఢాకా: బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ అరుదైన ఘనత సాధించాడు. సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో తమ దేశం తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు అరుదుగా కనిపిస్తుంటారు. ఉదాహరణకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వన్డేల్లో, టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు, కానీ టీ20లో మాత్రం అది సాధించలేకపోయాడు. ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు.
బంగ్లా క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ మాత్రం ఒక దేశం తరపున మూడు ఫార్మాట్లలో అత్యధిక పరుగులు చేసి ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లా ఇన్నింగ్స్ సమయంలో తమీమ్ ఇక్బాల్ 9 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఈ ఘనత అందుకున్నాడు. 2007లో వన్డేల్లో ఆరంగేట్రం చేసిన 31 ఏళ్ల వయసున్న బంగ్లాదేశ్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ 60 టెస్టుల్లో 9 సెంచరీలతో 4,405 పరుగులు, 210 వన్డేల్లో 13 సెంచరీలు, 49 అర్ధ సెంచరీలతో 7,360 పరుగులు చేశాడు. ఇక 78 టీ20 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడి ఒక సెంచరీ, 7 అర్ధ సెంచరీలతో 1,758 పరుగులు చేశాడు.
ఇదీ చదవండి: సఫారీ-కంగారూ సిరీస్ కు కరోనా దెబ్బ
భారత జట్టుకు చెందిన లెజండరీ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ టెస్ట్, వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్రపంచ రికార్డును కలిగి ఉండగా టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచారు. అయితే, ఈ మూడు ఫార్మాట్లలో బంగ్లాదేశ్‌కు చెందిన బ్యాట్స్‌మన్ అత్యధిక పరుగులు చేసి ప్రపంచ రికార్డును తన పేరిట రాసుకున్నాడు. ఒక దేశం తరపున మూడు ఫార్మాట్లలోనూ అత్యధిక స్కోరు సాధించిన ప్రపంచంలోని ఏకైక క్రికెటర్‌గా తమీమ్ ఇక్బాల్ అవతరించాడు.
2007లో వన్డేల్లో ఆరంగేట్రం చేసిన 31 ఏండ్ల వయసున్న బంగ్లాదేశ్ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ ఇప్పుడు టెస్టులు, వన్డేలు, టీ20 మూడు ఫార్మాట్లలో ఒక దేశం తరపున అత్యధిక పరుగులు చేసిన ఏకైక క్రికెటర్ గా అవతరించాడు. టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన తమీమ్ ఇక్బాల్ వన్డే, టీ 20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటికే బంగ్లాదేశ్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచి వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ముష్ఫికర్ రహీమ్‌ను అధిగమించాడు. వెస్టిండీస్‌పై బంగ్లాదేశ్ చిట్టగాంగ్‌లోని జహూర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో తొమ్మిదో పరుగు సాధించడంతో తమీమ్ ఇక్బాల్ ఈ ఘనత సాధించి కొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అయితే, ఆ తరువాతి బంతికే అవుట్ అయ్యాడు. బంగ్లాదేశ్ తరఫున 61 వ టెస్ట్ ఆడుతున్న తమీమ్ ఇక్బాల్.. 9 సెంచరీలతో 4,414 పరుగులు చేశాడు. ముష్ఫికర్ రహీమ్ 70 టెస్టుల్లో 7 సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలతో 4,413 పరుగులు చేశాడు. అయితే, ఈ మ్యాచ్‌లో ముష్ఫికర్ రహీమ్ కూడా ఆడుతున్నాడు. అతను ఒకటో, రెండో పరుగులు చేస్తే చాలా అత్యధిక పరుగుల ఇక్బాల్ రికార్డును మళ్లీ దాటేయవచ్చు. ఇలా ఉండగా, తమీమ్ ఇక్బాల్ వన్డేల్లో 210 మ్యాచుల్లో 13 సెంచరీలు, 49 అర్ధ సెంచరీలతో 7,360 పరుగులు చేశాడు. ఇదే సమయంలో ఒక సెంచరీ, 7 అర్ధ సెంచరీలతో 74 టీ20 అంతర్జాతీయ మ్యాచులలో 1,701 పరుగులు చేశాడు.
ఇదీ చదవండి:అరుదైన రికార్డులకు చేరువగా భారత్, ఇంగ్లండ్ కెప్టెన్లు