గింజలు నమిలాయి,
గాదె ను చప్పరించాయి
…పంది కొక్కులు… పంది కొక్కులు…
పంది కొక్కులు.
ఎరుపు, నీలం, ఆకు పచ్చ…
వడ్లు, వెదురు అయ్యాక
ఇల్లంతా తిరిగాయి.
గిన్నెలు గిరా టేసాయి.
డబ్బాలు విసిరేసాయి.
నేలను త్రవ్వాయి.
మంచం కొరికాయి.
నవారు నవిలాయి.
చివరిగా నిద్ర పోతున్న యజమానిని
కండ పట్టి గట్టిగా లాగాయి
రక్తం… కొత్త రుచి… ఎంతో రుచి
ఇదేదో బాగుందే అంటూ
ఎర్ర పళ్ళ తో విక విక లాడాయి .
మళ్ళీ తాగాయి. ఎంత బాగుందో.
వీడు లేవలే!
నొప్పి తెలియలే?
అవి తాగుతునే ఉన్నా యి.
తాగుతునే ఉన్నా యి.
తాగుతునే ఉన్నా యి
తాగుతునే ఉన్నా యి
వీడు లేవడేo?
ఎంతకు లేవడెమ్.
చూస్తారెం…
ఎవరన్నా లేపండయ్యా !
Also read: చరిత్రకారుడు
Also read: యుద్ధం
Also read: ఎవ్వడు వాడు
Also read: తమ్ముడు
Also read: కోడి