- బీజేపీ సొంతబలంతోనే 2023లో తెలంగాణలో అధికారంలోకి వస్తుంది
- 38 మంది టీఆర్ ఎస్ కార్పొరేటర్లకు ప్రజల మద్దతు లేదు
తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ, మరే ఇతర రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ అస్థిరపరచాలనే ఆలోచన బీజేపీ లేనేలేదనీ, బీజేపీ సొంత బలంతో 2023లో తెలంగాణలో అధికారంలోకి రావడం తథ్యమని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడూ, పార్లమెంట్ సభ్యుడూ బండి సంజయ్ సోమవారంనాడు స్పష్టం చేశారు.
దుబ్బాకలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కు
రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోయడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నదని అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన ప్రకటనకు స్పందిస్తూ సంజయ్ టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి కార్యక్రమాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం ఒక కంట గమనిస్తూనే ఉన్నదనీ, అవినీతి నిరోధక సంస్థలు సకాలంలో స్పందిస్తాయనీ అన్నారు. 12 మంది కార్పొరేటర్లకు ప్రజల మద్దతు లేదంటూ కేసీఆర్ ప్రకటించినప్పటికీ, నిజానికి 38 మంది టీఆర్ ఎస్ కార్పొరేటర్లకు ప్రజల మద్దతు లేదని సంజయ్ వ్యాఖ్యానించారు. ‘టీఆర్ ఎస్ విశ్వసనీయతను కోల్పోయింది,’ అంటూ విలేఖరుల సమావేశంలో బీజేపీ నేత వ్యాఖ్యానించారు. దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్, టీఆర్ ఎస్ లు కుమ్మక్కు అయినాయని ఆయన ఆరోపించారు.