తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్రమోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా లాంటి వారికి వంగి వంగి దండాలు పెట్టినా ఆయనపై గల అవినీతి ఆరోపణలను కేంద్రం వదిలిపెట్టబోదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తేల్చి చెప్పారు. సీఎం పదవి పోయినా పర్వాలేదు కానీ జైలుకు వెళ్లే పరిస్థితి రాకూడనది కోరుకుంటున్నారని, కానీ అదే తప్పకపోవచ్చని అన్నారు.
తన అవినీతిని కప్పి పుచ్చుకొని కేంద్రాన్ని మంచి చేసుకునేందుకే ఆయన డిల్లీ యాత్ర చేశారని విమర్శించారు. కేంద్రంపై యుద్ధం చేస్తానని గల్లీలో కత్తితిప్పి, ఢిల్లీలో సాగిల పడుతున్నారని అన్నారు.
కేసీఆర్ అవినీతిపై తప్పకుండా కేసులు వేస్తామని, త్వరలో కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయమని బండి జోస్యం చెప్పారు. మూడు ళేశ్వరంకా రుతోటీఎంసీల ప వేల కోట్ల దోపిడీకి కుట్ర చేశారని అన్నారు. తెలంగాణలో రైతులు ఆందోళన చేయకున్నా బంద్ కు పిలుపు ఇచ్చిన కేసీఆర్ ఢిల్లీలో రైతుల ఆందోళనకు ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించారు. హైదరాబాద్ నగరం వరదలతో వణికిపోయినప్పుడు పర్యటించని ముఖ్యమంత్రి ఇప్పుడు వరద సాయం కోసం ఢిల్లీ వెళ్లారంటేనమ్మాలా? అని ప్రశ్నించారు.
సుందర నగరాలు నిధులేవి?
కరీంనగర్, వరంగల్ ను సుందర నగరాలుగామార్చేందుకు కేంద్రం విడుదలు చేసిన రూ. 196 కోట్లు దారిమళ్లాయని, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా మొత్తాన్ని విడుదల చేయకపోవడ వల్ల ఆకర్షణీయ నగరాల జాబితా నుంచి ఆ రెండు జారిపోయే పరిస్థితి ఏర్పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేంద్ర నిధుల్లో రూ.40కోట్ల విలువ గల పనులు చేపట్టినా, వాటికి డీపీఆర్ లు ఇవ్వలేదని అన్నారు. పనులు సకాలంలో చేపడితే ఆ రెండు నగరాలకు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో రూ. వేలకోట్ల ప్రాజెక్ట్ లు వచ్చేవని అన్నారు.
రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలను భర్తీ ప్రకటనను స్వాగతిస్తు న్నామని,అయితే ముందుగా పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలని సంజయ్ అన్నారు. నిరుద్యోగ భృతి కోసం పోరుకు దిగుతామని చెప్పారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు రూ. 72 వేలు వంతున ప్రభుత్వం బకాయి పడిందని అన్నారు. సీఎం కేసీఆర్ పై ఉన్నఅవినీతి ఆరోపణలపై కేంద్రం విచారిస్తుందని చెప్పారు.