రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
కష్టం సుఖం జంట
ఒకదాని వెంట మరోటి
చెమట కార్చే కూలీ
ఒళ్లు మరచి నిద్ర పోతాడు
కష్టపడి చదివినవాడు
ఇష్టపడ్డ జీవితం గడుపుతాడు
ఆడ మగతనాల ఆరాట పోరాటంలో
ఆద్యంతం మిగిలేది సుఖమేగా
జటిల సమస్యలను ఆలోచనతో
అంతర్మధనంతో పరిష్కరించినపుడు ఆనందమేగా
అందుకే అన్నాడు కవి
“కలిమి లేములు, కష్ట సుఖాలు
కావడిలో కుండలనే భయమేలోయ్” అని.
కావడి మోత తప్పదు ఎవరికైనా
కావడి మూలం కొయ్యేనని
అది రూపాలు మారుతుందని
తెలుసుకోవడం కష్టం
ఆ సత్యం తెలిస్తే
మిగిలేది మహదానందమే.
Also read: సెంటిమెంట్ లేకపోతే …
Also read: నవరాగం