Sunday, December 22, 2024

సిలికానాంధ్ర ఆధ్వర్యంలో ఘనంగా బాలమురళి జయంతి

మంగళంపల్లి బాలమురళీకృష్ణ

దీనబాబు కొండుభట్ల

అమెరికాలోని కాలిఫోర్నియాలో సిలికానాంధ్ర మ్యూజిక్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ డాన్స్ అకాడమీ “సంపద” ఆధ్వర్యంలో కర్ణాటక సంగీత సమ్రాట్, తెలుగువారు గర్వించదగిన మహోన్నతమైన వ్యక్తి శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి 91వ జయంతి ఉత్సవాలు కన్నుల పండువగా నిర్వహించారు. జులై 4న అంతర్జాల మాధ్యమాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎంతోమంది లబ్దప్రతిష్టులైన కళాకారులు హాజరై బాల మురళి కృష్ణ గారితో తమకున్న అనుభవాన్ని, అనుబంధాలని  వీక్షకులతో పంచుకున్నారు.

participants in birthday anniversary of Balamuralikrishna

   

ప్రఖ్యాత వాయులీనం విద్వాంసులు శ్రీ అన్నవరపు రామస్వామి మాట్లాడుతూ, సంపద వారికి ఇలాంటి కార్యక్రమం నిర్వహించాలని ఆలోచన రావడం చాలా గొప్ప విషయం అనీ, డాక్టర్ బాల మురళి కృష్ణ కారణజన్ములు అనీ, వారికి సమకాలీకునిగా వారితో కలిసి శ్రీ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి దగ్గర విద్య నేర్చుకోవడం తమకు భగవంతుడిచ్చిన గొప్ప వరమనీ పేర్కొన్నారు. బాల మురళి కృష్ణ గారు సంగీతం లోనే కాకుండా లోనే కాకుండా వయోలిన్, వయోలా, మృదంగం, కంజీర వంటి వాద్యాలలో కూడా చక్కటి ప్రతిభను కనపరిచేవారు అని పేర్కొన్నారు.

ప్రముఖ నాట్యాచార్యులు పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ పద్మా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, భగవంతుడు సంగీత ప్రపంచానికి ఇచ్చిన అతి గొప్ప వరం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ అని తాను భావిస్తానని, వారు రచించి స్వరపరిచిన హిందోళ తిల్లానాకు డాన్స్ చేసే అవకాశం తొలిసారిగా తనకు కలిగిందని ఆ తర్వాత వారి కుటుంబంతో 50 సంవత్సరాలు పైగా అనుబంధ ఉందని ఇలాంటి కార్యక్రమాన్ని ‘సంపద’ ద్వారా నిర్వహించడం ఆనందంగా ఉందని తెలియజేశారు.
 

Sampada logo


ప్రముఖ సంగీత విద్వాంసురాలు పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ సుధ రఘునాథన్ మాట్లాడుతూ, బాల మురళి కృష్ణ జీవించి ఉన్న సమయంలో తను జీవించడం గొప్ప అదృష్టంగా భావిస్తాననీ, ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే సామెతకు చిరునామా మంగళంపల్లి బాలమురళీకృష్ణ అనీ, వయసుతో నిమిత్తం లేకుండా అందరిని ఆప్యాయంగా పలుకరిస్తూ ప్రోత్సహిస్తూ ఉండేవారనీ, వారితో వేదిక పంచుకున్నటువంటి సందర్భాలు తన జీవితాంతం గుర్తుండిపోతాయనీ పేర్కొన్నారు

ప్రముఖ వాయులీన విద్వాంసులు పద్మశ్రీ పురస్కార గ్రహీత అవసరాల కన్యాకుమారి మాట్లాడుతూ, బాల మురళి కృష్ణ తెలుగు జాతికి గర్వకారణమని వారి జయంతి సందర్భంగా ‘సంపద’ ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉందనీ, వారితో వేదికను పంచుకున్న ఎటువంటి ఎన్నో సందర్భాలు మరపురాని సంఘటనలుగా గుర్తుండిపోతాయి అనీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కేరళ రాష్ట్రం నుంచి మంగళంపల్లి వారి శిష్యులు ప్రిన్స్   రామ వర్మ,  హైదరాబాద్ నుంచి డీవీ మోహన కృష్ణ పాల్గొని గురువు గారితో వారికున్న అనుభవాలని పంచుకుని, బాలమురళి  రచించి, స్వరపరచిన కీర్తనలను పాడి నివాళి అర్పించారు.

Deenababu Kondubhatla



ఈ కార్యక్రమంలో ప్రముఖ మ్యూజికాలజిస్ట్ డాక్టర్ బి ఎం సుందరం, డాక్టర్ పప్పు వేణుగోపాలరావు, సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు చిత్రవీణ రవి కిరణ్, చిత్రవీణ నరసింహం, ప్రముఖ ఘటం కళాకారులు కార్తీక్, ప్రముఖ మృదంగ విద్వాంసులు పత్రి సతీష్ కుమార్, సంగీత విద్వాంసులు శ్రీరాం పరశురాం, మోదుమూడి సుధాకర్, వయోలిన్ కళాకారిణి పద్మ శంకర్, జీవీ ప్రభాకర్ , మంగళంపల్లి వారి కుటుంబ సభ్యులు అభిరామ్, డాక్టర్ మంగళంపల్లి వంశీ, కస్తూరి గోపాల రావు తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ నాట్య గురువు ప్రియదర్శిని గోవింద్ గారి సీనియర్ శిష్యురాలు శ్వేత ప్రచండె, బాలమురళి గారి థిల్లానాలకు తన అద్భుతమైన నాట్య ప్రదర్శనతో  వీక్షకులను అలరించింది. బాలమురళి గారి ప్రశిష్యులు చిట్టమూరి కారుణ్య, చిన్మయిలు బాలమురళి కీర్తనలు పాడి స్వర నివాళినర్పించారు.  

‘సంపద’ ఉపాధ్యక్షుడు ఫణి మాధవ్ కస్తూరి నాయకత్వంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ జీవిత విశేషాల పై ఇంగ్లీష్, తెలుగు భాషల్లో రూపొందించిన డాక్యుమెంటరీలు వీక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. దీనికి స్క్రిప్ట్ ప్లే రచించి, స్వరం అందించిన డాక్టర్ మాలస్వామి(ఇంగ్లీష్), వాచస్పతి అంబడిపూడి మురళీకృష్ణ(తెలుగు)కు సంపద అధ్యక్షులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు    

ఈ కార్యక్రమం మొత్తాన్ని సమన్వయపరిచి దిగ్విజయం చేయడానికి నాయకత్వం వహించిన ‘సంపద’ అధ్యక్షులు దీనబాబు కొండుభట్లకి మంగళంపల్లి బాలమురళీకృష్ణ శిష్యులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా సిలికానాంధ్ర వాగ్గేయకార విభాగం ఉపాద్యక్షులు వంశీకృష్ణ నాదెళ్ళ, సృజన నాదెళ్ళ మరియు మమత కూచిభొట్ల బాలమురళి  అభిమానులందరికీ అభినందనలు తెలిపారు.  ఈ కార్యక్రమాన్ని youtube.com/sampadatv ద్వారా చూడవచ్చు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles