Thursday, November 21, 2024

కేంద్ర భారతీయ భాషా సంస్థ, ఎమెస్కో జ్ఞానయజ్ఞం

బాలలకోసం సరళమైన రామాయణం

బాలలకోసం ఎమెస్కో మరో అద్భుత జ్ఞానయజ్ఞం నిర్వహించారు. సరళంగా రామాయణ గాధను ముందు తెలుగులో వాల్మీకి రామాయణాన్ని అనుసరించి రచించి దాన్ని మనదేశంలోని సకల భాషల్లో అనువదించి అందంగా ముద్రించి పిల్లలకు అందుబాటులోకి తేవడమే ఆ యజ్ఞం.

బాలలకోసం సరళమైన రామాయణం

బాలలకోసం ఎమెస్కో మరో అద్భుత జ్ఞానయజ్ఞం నిర్వహించారు. సరళంగా రామాయణ గాధను ముందు తెలుగులో వాల్మీకి రామాయణాన్ని అనుసరించి రచించి దాన్ని మనదేశంలోని సకల భాషల్లో అనువదించి అందంగా ముద్రించి పిల్లలకు అందుబాటులోకి తేవడమే ఆ యజ్ఞం.

ఎమెస్కో విజయకుమార్, డిజైనర్ తెలుగు ఫాంట్ల నిపుణుడు పురుషోత్తం కుమార్

విలువలు నిలువలు నిలువలుగా ఉన్న ప్రబోధ గ్రంధం రామాయణం. చిలువలు పలువలుగా మోసాలు నేరాలుపెరుగుతున్న ఈ సమాజానికి అవసరమైన మంచి సాహిత్యంరామాయణం. మంచి తనం, మంచి నడవడిక నేర్పే పాత్రల నడక ఈ కావ్యంలోకనిపిస్తుంది. స్థూలంగా కథ తెలిసినా వివరాలు చాలామందికి తెలియదు. ఈనాటి తల్లిదండ్రులకు ఎంతవరకు రామాయణం తెలుసో మనం చెప్పలేము.  అబద్దాలు మోసాలు వద్దని భారత రాజ్యాంగం ఇండియన్ పీనల్ కోడ్ చెప్పదు. ఆ పనులు చేస్తే శిక్షిస్తానంటుంది. కాని అబద్దాల వల్ల ఎవరికీ అబద్దనేరానికి శిక్ష పడడం లేదు. నిబద్ధత, నిజాయితీ, ధర్మం, న్యాయం అంటే ఏమిటో రామాయణం చెబుతుంది.

సుందరకాండ ఆరంభం, మచిలీపట్నం శాస్త్రిగారి కళారూపం, హనుమ చూసిన స్వర్ణ లంక

ఒక అద్భుతమైన అత్యంత ప్రాచీన మయిన ఆదికావ్యంగురించి అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లోకి అనువాదమై, దాదాపు అందరికీ తెలిసిన గొప్ప వ్యక్తివికాస మార్గదర్శిని రామాయణం. ఎందరు వక్రీకరించినా, తమకు తోచిన వ్యాఖ్యానాలుచేసినా, కథానాయకులజీవితాన్ని వక్రీకరించిచ ప్రతినాయకులను గొప్పగా చిత్రీకరించి ప్రజాదరణ పొందితే పొందవచ్చు. కాని వాస్తవం వాస్తవంగా నిలబడే ఉంటుంది.

విజృంభించిన కుంభకర్ణుడు. అతని భారీ కాయాన్ని తన కళాచిత్రణలో చూపిన శాస్త్రి

రామాయణ భారత భాగవతాలను ద్వేషించి ఈ రచయితలు సాధించేదేమిటో వారికే తెలియాలి. వాటిని సానుకూలంగా జీవన గమనానికి వాడుకునే అవకాశాలను వదులుకోవడం ఎంత వివేకవంతమో మిగిలిన వారు ఆలోచించాలి.

బ్రహ్మాస్త్రంతో రావణుడిన సంహరించిన చిత్రం

శూర్పణఖ తనను ప్రేమించడానికి వస్తే రాముడు తిరస్కరించడం న్యాయం కాదని ఒకరు రచించారు. శూర్పణఖ వివాహితురాలు. భర్తను రావణుడే చంపేస్తాడు. వయసు శరీరం పెద్దది. రాముడు రావణుడికన్న అతని చెల్లెలు శూర్పణఖ కన్న కొన్ని వేల సంవత్సరాలు చిన్న. వేల సంవత్సరాలు అని నమ్మడం ఇష్టం లేకపోతే అనేకానేక సంవత్సరాలు చిన్న అనైనా అంగీకరించకతప్పదు. తను అందమైన వనితగా వేషం మార్చుకుని వస్తుంది.  వేరే వేషం వేసుకున్న వారి అసలు వేషం రూపం సంభోగసమయంలో మరణ సమయంలో బయటకు వస్తుందనేది వేషమార్పిడి విద్యతెలిసిన నాటి కాలపు సూత్రం. వివాహితుడు ఏకపత్నీవ్రతుడైన రాముడు శూర్పణఖను ప్రేమించలేదని ఈ రచయిత బాధపడడం ఒక కొత్త వింత ఆలోచన. కొందరికి నచ్చితే నచ్చవచ్చు. కాని రామాయణంలో రాముడికి రావణుడికి శత్రుత్వాన్ని ఒక మలుపు తిప్పే సంఘటన ఇది.

వల్లీశ్వర్ | సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వల్లీశ్వర్, రచయిత

సాధారణ మానవుడిగా రాముడు ఎంత సమున్నతమైన జీవనాన్ని సాగిస్తాడే చెప్పే రామాయణాన్ని మించిన మంచి జీవన గాధ మరొకటి కనిపించదు.

పిల్లలకు ఆ గాధ చెప్పడానికి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ మానసగంగోత్రి మైసూర్ వారి ఆధ్వర్యంలో ఈ పుస్తకాన్న రూపొందించారు. బాలా సాహిత్య నిధి పథకంలొ భాగంగా ఈ పుస్తకాలు రచించి ప్రచురించారు.

వాల్మీకి రామాయణం ఆధారంగా ప్రముఖ రచయిత పాత్రికేయుదు, జి వల్లీశ్వర్ కథారూపాన్ని సమకూర్చారు. తెలుగులో చాలా సులువుగా అర్థమయ్యే సరళమైన భాషలో రచన సాగించారు.

జి. ప్రభాకర్ దీనికి సంపాదకుడు. డిఎస్ కె వి శాస్త్రి మచిలీపట్నం 112 వర్ణచిత్రాలను అద్భుతంగా రూపొందించారు. 112 పేజీల కథాకథనాన్ని వల్లీశ్వర్ అందించారు.

సరిగ్గా ఇంత పరిమాణంలోనే అన్ని భాషలలో రామాయణం రూపొందించారు.  కంప్యూటర్ లో తెలుగు ఫాంట్ల నిపుణుడు, జి. పురుషోత్తం కుమార్ డిజైన్ చేసారు. ఎమెస్కో విజయకుమార్ ప్రచురించారు. 

అగ్ని పునీత సీత

అగ్నిపునీత, శాస్త్రి అద్బుత చిత్రణ

హార్డ్ బౌండ్ ప్రతికి 500 రూపాయలు, పేపర్ బాక్ ప్రతికి 400 రూపాయలు వెల నిర్ణయించారు. హైదరాబాద్ గగన్ మహల్ రోడ్ లో సాధూరాం కంటి ఆస్పత్రి పక్కన బానూ కాలనీలో ఉన్న ఎమెస్కో కార్యాలయంలో ప్రతులు లభిస్తాయి.  ముందు పెద్దలు తల్లిదండ్రులు రామాయణ కథను తెలుసుకోవడానికి ఈ పుస్తకం చదివి, పిల్లలకు చదవడానికి అవకాశం కల్పించాలి. వారిచేత చదివించాలి.  ‌                  

మాడభూషి శ్రీధర్

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

2 COMMENTS

  1. A great Epic regarding Vishnu Avatar as SriRama though here and there little fanaticise it is a Mahavakyam By seer Valmiki .

  2. In our primary school level our school library provided those books Balalaika bommalaRamayanam,Bhagavatham Bharatham we read them a seven decades back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles