Authors

మాజీ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు భారతీయ జనతా పార్టీ నాయకులు. అయనకు పేదల పక్షపాతిగా, ప్రజల తరఫున నిలిచే అధికారిగా పేరుంది. అనేక రంగాలలో అనేక హోదాలలో పని చేసి విశేషమైన అనుభవం గడించిన వ్యక్తి.

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

డాక్టర్ గోపరాజు నారాయణరావు వరిష్ఠ పాత్రికేయులు. బహుగ్రంధ రచయిత. వర్తమాన పరిణామాలపైన వ్యాసాలు కొన్ని దశాబ్దాలుగా రాస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర రచించారు. ప్రస్తుతం ‘జాగృతి’ పత్రిక సంపాదకులుగా పని చేస్తున్నారు.

డాక్టర్ ఎన్. భాస్కరరావు దిల్లీలోని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ చైర్మన్. అయిదు దశాబ్దాలకు పైగా ప్రజాసంబంధమైన విషయాలపైన అధ్యయనం చేస్తూ, సర్వేలు జరిపిస్తూ, నివేదికలు వెల్లడిస్తూ, పుస్తకాలు రచిస్తూ, ప్రభుత్వాలకు సలహాలు ఇస్తూ ప్రజామేధావిగా సమాజానికి శక్తివంచనలేకుండా సేవచేస్తున్నారు.

సాహితి వివరాలు : 1985 నుంచి రాస్తున్నా. వివిధ పత్రికల్లో కధలు,కవితలు,కార్టూనులు వస్తున్నాయి. ఆంగ్లం లో కూడా వంద కి పైగా కవితలు వెబ్ పత్రికల్లో ప్రచురిత మయ్యాయి. వృత్తి : నిర్మాణ రంగం లో ఐటీ విభాగం మేనేజర్ ఉద్యోగం
ఆంగ్లం లో Vibrations of my heart Amazon Kindle పుస్తకం గా ప్రచురణయ్యింది.

సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

రచయిత పార్లమెంటు మాజీ సభ్యులు, ఉత్తరాంధ్ర చర్చావేదిక కన్వీనర్

A broadcaster by profession, media researcher by training, a staunch Gandhian in thought, and a science writer by passion, Dr. Nagasuri Venugopal writes prolifically on contemporary issues. He penned over 60 books and two thousand newspaper articles so far. He is a PhD in journalism.