Authors

సి. ఉమామహేశ్వరరావు ప్రముఖ తెలుగు చిత్ర దర్శకుడు. అంకురం సినిమా దర్శకుడుగా ప్రఖ్యాతిగాంచారు. అనేక చిత్రాలకు దర్శకత్వం వహించారు. రెండు నంది అవార్డులూ, ఒక జాతీయ ఫిలిం అవార్డూ గెలుచుకున్నారు. ఇటీవల విడుదలైన ‘ఇట్లు అమ్మ’ చిత్రానికి దర్వకత్వం వహించారు. విద్యాధికులు. వామపక్ష భావజాలం కలిగిన ప్రజాస్వామ్యవాది, సౌమ్యవాది.

వి. జానకి రామారావు
ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

యోగేంద్ర యాదవ్ స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు. స్వరాజ్ అభియాన్, జైకిసాన్ ఆందోళన్ సంస్థల సభ్యుడు. భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకై శ్రమిస్తున్న బుద్ధిజీవులలో ఒకరు. దిల్లీ నివాసి.

ప్రొఫెసర్ కోదండరాం ఉస్మానియాలో రాజకీయశాస్త్రం ఆచార్యుడిగా పనిచేసి రిటైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో జాయంట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) చైర్మన్ గా ప్రముఖ పాత్ర పోషించారు. ఇప్పుడు తెలంగాణ జనసమితి అధినేతగా రాజకీయ క్షేత్రంలో నిర్విరామంగా కృషి చేస్తున్నారు.

టి. అతావుల్లా, సీనియర్ జర్నలిస్టు
జర్నలిస్టుగా 27 ఏళ్ళ అనుభవం. పరిశోధనాత్మక జర్నలిస్టుగా వార్తలో అనేక కథనాలు రాశారు. తర్వాత ఆంధ్రప్రభలో ప్రచురించారు. ఎడిట్ పేజీలో వ్యాసాలు అనేకం రాశారు. ఆంధ్రప్రదేశ్ శ్రీసత్యసాయిజిల్లా గోరంట్ల వాస్తవ్యులు.

రచయిత సీనియర్ జర్నలిస్టు, మానవ హక్కుల కార్యక్రమాలలో క్రియాశీలక భాగస్వామి. ప్రజాస్వామ్య, ఉదారవాద విలువల పట్ల ప్రగాఢమైన విశ్వాసం కలవారు.

డాక్టర్ బి.సారంగపాణి,
ఆర్థికశాస్త్రంలో మాజీ ఆచార్యులు. విధానపరమైన విశ్లేషకులు.

జంగా గౌతమ్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు. సామాజిక న్యాయ ఉద్యమ కార్యకర్త