ఆంధ్రయూనివెర్సిటీలో జ్యోతిష్యాన్ని కోర్సుగా పెట్టాలని, సోమవారం ఒక జ్యోతిష్కుడు ఆ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డిని కలసి విఙ్ఞప్తి చెయ్యగా, పరిశీలిస్తానని చెప్పటం ఆంద్ర యూనివర్శిటీ పేరు ప్రఖ్యాతులను దిగజార్చటమే అవుతుంది.
ఇప్పటికే కొన్ని యూనివెర్సిటీ లలో వాస్తు , జ్యోతిష్యాలను కోర్సులుగా పెట్టి అధునిక విజ్ఞానాన్ని అపహస్యం చేస్తున్నారు. 2001 లో అప్పటి కేంద్ర మంత్రి మురళీమనోహర్ జొషి యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ హరి గౌతమ్ కలసి దేశంలోని కొన్ని యూనివర్సిటీలలో వాస్తుజ్యోతిష్యాలను కోర్సులుగాపెట్టి అధునిక విజ్ఞానాన్ని అపహాస్యం చెశారు. ఈమధ్య హిందూ బెనారస్ యూనివర్శిటీ వారు భూత వైద్యాన్ని కోర్సుగా పెట్టి శాస్త్ర విఙ్ఞానాన్ని బంగాళాఖాతంలో కలిపేశారు.
Also read: చేవూరి దొంగస్వామి నుంచి చెరువు పోరంబోకు తక్షణమే స్వాదీనం: వెంకటసుబ్బయ్య విజ్ఞప్తి
జ్యోతిష్యం నిజమని, శాస్త్రీయమని ప్రపంచములొ ఇంతవరకు రుజువుకాలేదు. జ్యోతిష్యం అబద్ధం, బూటకం, మోసం కనుక నమ్మవద్దని 1975 లో 192 మంది వివిధరంగాలలోని శాస్త్రజ్ఞులు ప్రకటించారు. వీరిలో 17 మంది నోబెల్ బహుమతి గ్రహీతలున్నారు. జ్యోతిష్యం మోసమని వివేకానందుడు ప్రకటించాడు.
జ్యోతిష్యం అబద్ధమని మనమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రు చెప్పాడు. ప్రపంచములొ జ్యోతిష్యం నిజమని రుజువుకాలేదు.
జ్యోతిష్యం నిజమని నిరూపిస్తే కోటిరూపాయలిస్తానని కర్ణాటకలో ఒక హేతువాది నటరాజ్ ప్రకటించాడు. జ్యోతిష్యం నిజమని నిరూపిస్తే లక్షరూపాయలిస్తానని డాక్టరు AT కోవూరు 1975 లో గారుప్రకటించాడు. ఇప్పుడదికూడా కోటి రూపాయలయ్యింది. జ్యోతిష్యం నిజమని నిరూపిస్తే ఐదుకోట్ల రూపాయలిస్తానని అమెరికన్ హేతువాది జేమ్స్ రాండీ గత 40 సంవత్సరాలుగా ప్రపంచమొత్తం సవాలుచేశాడు. ఇంతవరకు ఒక్క జ్యోతిష్కుడు కూడా ముందుకు రాలేదు.
Also read: మతములన్నియు మాసిపోవును.. జ్ఞానమొక్కటే నిలిచి వెలుగును”
అంతెందుకు? 2019 ఎన్నికలప్పుడు ఏపీ హేతువాదసంఘం చంద్రబాబుకి ఎన్ని సీట్లు వస్తాయి, జగన్ కి ఎన్నిసీట్లు వస్తాయో కరెక్ట్ గా చెప్పగలిగిన జ్యోతిష్కుడిని విజయవాడ పురవీధుల్లో ఎనుగు అంబారీపై ఉరేగిస్తామని సవాల్ చెయ్యటం జరిగింది. ఒక్కడు ముందుకురాలేదు.
మరి అలాంటి అశాస్త్రీయమైన జ్యోతిషాన్ని ఆంధ్రయూనివెర్సిటీలో పెట్టే విషయం పరిశీలిస్తానని ఆ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ చెప్పటం అయన అజ్ఞానానికి నిదర్శనం.
కనుక ఇలాంటి తప్పుడు నిర్ణయాలను వెంటనె ఉపసంహరించుకుని, శాస్త్రవిజ్ఞానాన్ని విద్యార్థులకు అందించాల్సిన దిశగా యూనివర్సిటీలు అన్నీ ముందుకుసాగాలి. ఇప్పటికే యూనివర్శిటీలలో ఉన్న వాస్తుజ్యోతిష్యం, భూతవైద్యంకోర్సు లాంటి అశాస్త్రీయమైన వాటిని తొలగించాలి.
Also read: హైకోర్టుతీర్పు అభినందనీయం, ప్రభుత్వానికి చెంపపెట్టు
నార్నెవెంకటసుబ్బయ్య.
అద్యక్షుడు, ఏపీ హేతువాదసంఘం.