అసోంలో తొలిదశ ఎన్నికల పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశారు. అధికారం కాపాడుకునేందుకు బీజేపీ, ఈ సారైనా గెలిచి గత వైభవాన్ని సాధించాలని కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అసోంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు గానూ 47 సీట్లకు శనివారం తొలి దశ పోలింగ్ జరగనుంది. బీజేపీ, ఏజీపి కూటమి, కాంగ్రెస్ మహాకూటమి, కొత్తగా ఏర్పాటైన అసోం జాతీయ పరిషత్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ప్రధాన పోటీ మాత్రం బీజేపీ, కాంగ్రెస్ కూటముల మధ్య ఉంటుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. మొదటి విడత పోలింగ్లో అసోం సీఎం, బీజేపీ నేత, సర్బానంద సోనోవాల్, అసెంబ్లీ స్పీకర్ హితేంద్రనాథ్ గోస్వామి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రిపున్ బోరా వంటి ప్రముఖులు బరిలో ఉన్నారు.
Also Read: అసోంలో కమలదళానికే మళ్ళీ కిరీటమా?
తొలి విడతలో మొత్తం 47 స్థానాలకు గానూ 264 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 81.09 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11,537 పోలీంగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. వీటిలో 479 కేంద్రాల్లో మొత్తం మహిళా అధికారులే ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. పోలింగ్ ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6 వరకు జరగనుంది. కరోనా నేపథ్యంలో కొవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు. ఈ నేపథ్యంలో ఓటర్లకు ఒక గంట అధిక సమయాన్ని కేటాయించారు. దివ్యాంగ ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు:
ఎన్నికల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. సమస్యాత్మక ప్రాంతాలలో భారీగా పోలీసులను మోహరించారు.
Also Read: అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ద్వంద్వ వైఖరి