Thursday, November 7, 2024

టెస్టు క్రికెట్లో అశ్విన్ మరో ప్రపంచరికార్డు

  • 200 మంది లెఫ్ట్ హ్యాండర్లను పడగొట్టిన స్పిన్నర్
  • హోంగ్రౌండ్లో వరుసగా రెండోసారి 5 వికెట్లు

భారత స్పిన్ జాదూ రవిచంద్రన్ అశ్విన్ తన రికార్డులను తానే అధిగమించుకొంటూ పోతున్నాడు. తన హోంగ్రౌండ్ చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండోటెస్టు రెండోరోజుఆటలో మరో అరుదైన ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. తొలిఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ ను 134 పరుగులకే కుప్పకూల్చడంలో ప్రధానపాత్ర వహించాడు.

29వసారి 5 వికెట్లు….

చెపాక్ వేదికగా గతవారం ముగిసిన తొలిటెస్టు రెండోఇన్నింగ్స్ లో 6వికెట్లు పడగొట్టిన అశ్విన్…రెండోటెస్టు తొలిఇన్నింగ్స్ లో సైతం అదేజోరు కొనసాగించాడు.43 పరుగులకే 5 వికెట్లు పడగొట్టాడు.ఓపెనర్ సిబ్లే, వన్ డౌన్ లారెన్స్, ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్, వోలీ స్టోన్, స్టువర్ట్ బ్రాడ్ లను అవుట్ చేయడం ద్వారా అశ్విన్ తన టెస్టు కెరియర్ లో 29వసారి 5 వికెట్ల రికార్డు నమోదు చేశాడు.

Also Read: అశ్విన్ స్పిన్ జాదూలో ఇంగ్లండ్ గల్లంతు

లెఫ్ట్ హ్యాండర్స్ పాలిట సింహస్వప్నం:

అంతేకాదు…14 దశాబ్దాల టెస్టు చరిత్రలో అత్యధికమంది లెఫ్ట్ హ్యాండర్లను పడగొట్టిన తొలిబౌలర్ గా అశ్విన్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లండ్ టెయిల్ ఎండర్ స్టువర్ట్ బ్రాడ్ ను క్లీన్ బౌల్డ్ చేయడం ద్వారా..200 మంది ఎడమచేతివాటం బ్యాట్స్ మన్ ను పెవీలియన్ దారి పట్టించిన బౌలర్ గా చరిత్ర సృష్టించాడు.టెస్ట్ క్రికెట్ లో అత్యంత దూకుడుగా ఆడే కంగారూ ఓపెనర్ వార్నర్ ను అత్యధికంగా పదిసార్లు పడగొట్టిన బౌలర్ కేవలం అశ్విన్ మాత్రమే. ఇంగ్లండ్ మాజీ ఓపెనర్ అలీస్టర్ కుక్ ను తొమ్మిదిసార్లు, ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ను ఎనిమిదిసార్లు అవుట్ చేసిన రికార్డు అశ్విన్ కు ఉంది. 34 ఏళ్ల అశ్విన్ ప్రస్తుత చెన్నై రెండో టెస్ట్ వరకూ ఆడిన 76 మ్యాచ్ ల్లో 391 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 7సార్లు 10వికెట్లు, 29సార్లు 5 వికెట్ల సాధించిన రికార్డులు సైతం ఉన్నాయి.

అశ్విన్ డబుల్…

టెస్టు క్రికెట్‌లో ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండర్‌ బ్యాట్స్‌మెన్లను ఔట్‌  చేసిన బౌలర్‌గా రవిచంద్రన్‌ అశ్విన్‌ నిలిచాడు. గత ఏడాది ముగిసిన మెల్బోర్న్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో కంగారూ టెయిల్ ఎండర్ జోష్ హేజిల్ వుడ్ ను అవుట్ చేయడం ద్వారా శ్రీలంక లెజెండ్‌ ముత్తయ్య మురళీధరన్‌ పేరిట ఉన్న అరుదైన రికార్డును అధిగమించిన అశ్విన్ ఆ తర్వాత నుంచి తన రికార్డును తానే అధిగమిస్తూ వస్తున్నాడు.ఇప్పటి వరకు 200 మంది ఎడమచేతివాటం ఆటగాళ్లను ఔట్‌ చేసిన రికార్డు తో అశ్విన్ అగ్రస్థానంలో నిలిచాడు. 191 మందిని అవుట్ చేయడం ద్వారా ముత్తయ్య మురళీధరన్ రెండోస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో ఇంగ్లాండ్‌ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ మూడు, ఆస్ట్రేలియా దిగ్గజాలు గ్లెన్‌ మెక్‌గ్రాత్‌(172), షేన్‌ వార్న్‌(172) నాలుగు స్థానాల్లో ఉన్నారు. భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే 167 మందిని ఔట్‌ చేసి ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.

Also Read: చెపాక్ లో రోహిత్ షో

400 వికెట్ల రికార్డుకు 9 వికెట్ల దూరంలో నిలిచిన అశ్విన్ ప్రస్తుత సిరీస్ లోని మిగిలిన ఐదు ఇన్నింగ్స్ లోనే ఆ ఘనతను సాధించే అవకాశాలు ఉన్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles