భారతీయ ఆంగ్ల కవులు-7
అరుంధతి సుబ్రహ్మణ్యం ప్రసిద్ధ కవయిత్రి. తను రాసిన పుస్తకాలు అనేక భాషల్లోకి అనువదించ బడ్డాయి. జాన్ కీట్స్ కవిత్వంలో కనిపించే ‘అస్థిరరతతో మనగలగడం’ (నెగటివ్ కేపబిలిటి) ఈవిడ కవిత్వంలోనూ కనిపిస్తుంది. జవాబు లేని ప్రశ్నలతో ఇబ్బంది పడకుండా ఉండగలగడం అపురూపమైన విషయం. దానికి ఎంతో ఆత్మ సంయమనం కావాలి. తను ఈ లోకంనుండి పోయేటప్పుడు తన ఉనికిని సూచించే ఏ జాడలు కోరుకోకపోవడం నిజమైన భక్తి లక్షణం అంటుందీ కవయిత్రి. అంటే నిజమయిన భక్తుడు ఏ కోరిక లేకుండా ఉంటాడు. చివరికి దేవుడికి దగ్గరవ్వాలనే కోరిక కూడా ఉండదు. సద్గురు ఆత్మకధను రాసిన ఈవిడ పరిపక్వత మనకు ఈ కవితలో కనిపిస్తుంది. “స్ట్రాటజిస్ట్” అనే మరో కవితలో మన శరీరానికే కాక మనసుకు కూడా శ్రమ ఉండాలి, లేకపోతే అవి జబ్బు పడతాయంటారు. భయం, అసూయ లాంటి వాటినుండి మనం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండి మనల్ని మనం రక్షించు కోవాలంటారు.
Also read: జీత్ తాయిల్
Also read: శివ్ కె కుమార్
Also read:కేకి దారూవాలా
Also read: జయంత్ మహాపాత్ర
Also read: నిస్సిం ఎజేకియల్
Also read: ఎకె రామానుజం