- మంచిర్యాల జిల్లాలో దొంగల ముఠా అరెస్టు
- విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం
చోరీ చేసిన సొత్తును విక్రయిస్తున్న ఇద్దరు దొంగలను మంచిర్యాల పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం (మార్చి 3) ఉదయం మంచిర్యాల రూరల్ సిఐ. కె కుమారస్వామి, సిసిఎస్. ఇన్స్ స్పెక్టర్ రమణ బాబు, సబ్ ఇన్స్ స్పెక్టర్ సి.సి.ఎస్. ఎం. ప్రసాద్, డి. మహేందర్ మంచిర్యాల, సీసీఎస్ సిబ్బంది మరియు నస్పూర్ ఎస్ ఐ శ్రీనివాస్, సిబ్బంది తోళ్ళవాగు వద్ద సోదాలు నిర్వహిస్తున్నారు. తనిఖీలలో భాగంగా పోలీసులను చూసి ఇద్దరు అనుమానిత వ్యక్తులు తాము నడుపుతున్న మోటర్ బైక్ ను వదిలి పారిపోతుండగా వాళ్ళను పట్టుకొని సోదాలు చేశారు. వారి వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేయగా ఇనుపరాడ్డుతో పాటు బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
అనుమానితులను పెద్దపల్లికి చెందిన రౌతు దిలీప్, మంథవి తరుణ్ గా ధృవీకరించారు. గతంలో రౌతు దిలీప్ గోదావరిఖని 1వ టౌన్ లో మరియు మంథని తరుణ్ గోదావరిఖని 1 టౌన్,2వ టౌన్ తో పాటు పలు ప్రాంతాలలో దొంగతనాలు చేయగా గోదావరిఖని పోలీసులు అరెస్ట్ చేసి ఇద్దరిని జైలుకు పంపారు. ఇటీవలే శిక్షాకాలం ముగియడంతో జైలు నుండి బయటకు వచ్చి మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఫిబ్రవరి 19న సి.సి.సి. నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధి ప్రశాంత్ నగర్ లో దొంగతనం చేసినట్లు అంగీకరించారు.
Also Read: బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం పై నిషేధాజ్ఞలు కొనసాగింపు
దొంగతనాలలో హస్తవాసి :
పోలీసుల తనిఖీలలో పట్టుబడిన దిలీప్, తరుణ్ లు గోదావరిఖని 1వ టౌన్, 2వ టౌన్, నస్పూర్ పోలీస్ స్టేషన్ చుట్టుప్రక్కల శివారు ప్రాంతాలలో మోటర్ సైకిల్ పై వచ్చి తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇనుపరాడ్డుతో తాళాలను పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో అంగీకరించారు. చోరీలకు పాల్పడగా వచ్చిన బంగారు, వెండి ఆభరణాలను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో పోలీసుల కంటపడ్డారు. వారి వద్ద నుంచి సుమారు 200 గ్రాముల బంగారు, 31 తులాల వెండి ఆభరణాలు ఒక మోటార్ సైకిల్, మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.
దొంగలను పట్టుకున్న వారికి అభినందనలు:
దొంగలను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన మంచిర్యాల రూరల్ సి.ఐ. కె, కుమారస్వామి, సిసి.ఎస్, ఇన్స్ స్పెక్టర్ రమణ బాబు, సి.సి.సి. నస్పూర్ ఎస్.ఐ , టి. శ్రీనివాస్, మరియు సి.సి.ఎస్. సిబ్బంది, ఎస్ఐ లు ప్రసాద్ డి. మహేందర్, అశోక్, ఇసాక్ ఆలీ, కానిస్టేబుల్ సతీష్, ఎ. సత్తయ్య. బాలక్రిష్ణ, శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ రామారావు కానిస్టేబుల్స్ ప్రభాకర్ రెడ్డి, ఇ. శ్రీనివాస్, కె. రాజయ్య డీసీపీ మంచిర్యాల, అడ్మిన్ అశోక్ కుమార్ లను అభినందించారు.
Also Read: 16 నెలలుగా వేతనాలు లేని ఆర్పీ లు