అర్జా జనార్ధనరావు (డిసెంబర్ 21, 1926 – నవంబర్ 4, 2007) ప్రసిద్ధ తెలుగు నాటక, సినిమా నటుడు. ఆయన ఎక్కువగా పౌరాణిక చిత్రాలలో హనుమంతుని వేషంతో మంచిపేరు సంపాదించుకున్నారు. హనుమ అనగానే గుర్తువచ్చే విధంగా ఆయన నటన ఉండేది.
అర్జా జనార్ధన రావు 1926 డిసెంబరు 21న కాకినాడలో జన్మించారు. స్వస్థలం కాకినాడలోనే బి.ఎ., బి.ఎస్.సి చదువుకున్నారు. చదువుకొనే సమయంలోనే ఆయనకు నాటక రంగంలో కొంత అనుభవం కలిగింది. ఆయనకు చిన్నతనం నుండి ఆటలమీద, కసరత్తులు చేయడం మీద ఉత్సాహం ఉండేది. ఆ ఉత్సాహమే ఆయనను మిస్టర్ ఆసియా, మిస్టర్ హెర్క్యులస్ (1954), మిస్టర్ ఇండియా (1955)గా ఎన్నిక చేసింది. ఇతడు శబ్దగ్రహణ శాఖలో డిప్లొమా చదివి కొన్నాళ్ళు శ్యామలా స్టుడియోలో రికార్డిస్ట్‌గా పనిచేశారు.
లవకుశ (1963); శ్రీకృష్ణావతారం (1967); వీరాంజనేయ (1968); శ్రీ రామాంజనేయ యుద్ధం (1974);
ముత్యాల ముగ్గు (1975);శంకరా భరణం (1979); త్యాగయ్య (1981); శ్రీ ఆంజనేయ చరిత్ర (1981); దేవాంతకుడు (1984); తదితర చిత్రాలలో జనార్దన రావు విభిన్న పాత్రలు పోషించారు. 2007 నవంబరు 4 (వయసు 80)న ఆయన మరణించారు. డిటెక్టివ్ నవలా రచయిత విశ్వప్రసాద్ కథ, మాటలు సమకూర్చిన, 1969 జూలై 25న సినిమా విడుదలైన, కృష్ణ, గుమ్మడి, ఎస్వీ రంగారావు, వాణిశ్రీ లు ప్రధాన పాత్రధారులుగా ఉన్న జగత్ కిలాడీలు’ చిత్రంలో జనార్దన రావు భిన్నమైన పాత్రలో నటించారు. ఈ సందర్భంగా రామాంజనేయ యుద్ధం చిత్రంలో ఒక పాటను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. జనార్దన రావు … ఆంజనేయ పాత్రలో లీనమై నటించగా, ఆ సన్నివేశంలో, ఆయన హావభా వాలు నాటి సినిమా ప్రియులు ఎన్నటికీ మరచి పోలేనివి. 1975లో పొట్లూరి వెంకట నారాయణ, ఎన్.ఎస్.మూర్తి కలిసి శ్రీరామాంజనేయ యుద్ధం పేరుతో కలర్ సినిమా నిర్మించారు. బాపు దర్శకత్వం వహించిన సినిమాకు ముళ్లపూడి వెంకటరమణ మాటలు రాయకుండా ఉన్న అరుదైన సినిమా శ్రీ రామాంజనేయ యుద్ధం.
బాపు−ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా శ్రీరామాంజనేయ యుద్ధం. గతంలో గబ్బిట వెంకటరావు రాసిన పద్యనాటకం లోని పద్యాలను యధాతధంగా వాడడంతో సంభాషణలు కూడా అతని చేత రాయించారు. ఎన్టీఆర్ రాముడిగా, అర్జా జనార్దనరావు ఆంజనేయుడుగా, బి.సరోజదేవి సీతగా, ధూళిపాళ్ల యయాతిగా నటించిన ఈ చిత్రానికి కె.వి.మహదేవన్ సంగీతం సమకూర్చారు. ఇందులో ఆంజనేయుడు ఆలపించే రెండు ఆర్ధ్రమైన పాటలను వినూత్నంగా ఉంటుందని రఘురామయ్య చేత పాడించారు. వాటిలో మొదటిది ‘రామ నీలమేఘ శ్యామా కోదండరామా’ కాగా, రెండవది ‘శరణు శరణయా జానకిరామా, కరుణ జూపవా మారుతిపై సాకేత సార్వభౌమా’ అనే పాట. ఈ రెండవ పాటకు కె.వి. మహ దేవన్ ఒక హిందీ పాట బాణీని అనుకరించడం వింతగా చెప్పుకున్నారు. అందుకు కారణం...మహదేవన్ ఎప్పుడూ ముందుగా ఇచ్చే బాణీకి పాట స్వరపరచ లేదు. కవి రాసిన ఎటువంటి పాటకైనా అద్భుతంగా బాణీలు కట్టటం మహదేవన్ నైజం. తద్భిన్నంగా ‘సాకేత సార్వభౌమా’ పాటకు మహదేవన్ అనుకరించిన హిందీ పాట 1964లో రాజశ్రీ ప్రొడక్షన్స్ నిర్మాత తారాచంద్ బరజాత్యా సత్యన్‌బోస్ దర్శకత్వంలో నిర్మించిన సూపర్ డూపర్ హిట్ చిత్రం ‘దోస్తీ’లో మహమ్మద్ రఫీ పాడిన ‘చాహూంగా మై తుజ్హే సాంఝ్ సవేరే...ఫీర్ భి కభీ ఆబ్ నామ్ కో తేరే ఆవాజ్ మై న దూంగా’ మహదేవన్ అనుకరించడాన్ని విశేషంగా చెప్పుకుంటారు.
(నవంబర్ 4 అర్జా వర్ధంతి)
వీర భక్త హనుమాన్ పాత్ర అనగానే మనలో చాలామందికి గుర్తొచ్చే పాత్రధారి ఆర్జా జనార్ధన రావు.. కళ్లల్లో ఎప్పుడూ సీతారాముని పట్ల అచంచలమైన భక్తి విశ్వాసాలను ప్రదర్శింపజేస్తూ ఆంజనేయస్వామి అంటే ఆర్జా జనార్ధన రావు అనిపించేలా తన నటనా సామర్థ్యాన్ని తెలుగు తెరపై ఆవిష్కరించిన అపురూపమైన ప్రతిభాశాలి గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు సర్..