- అద్భుతం సాధించిన మెస్సీ
- అర్జెంటీనాకు 36 ఏళ్ళ తర్వాత ప్రపంచ టైటిల్ సాధించి పెట్టిన మెస్సీ
- గొప్పగా పోరాడిన ఫ్రాన్స్ ఆటగాడు ఎంబాప్పే
కతార్ లో జరిగిన ప్రపంచ ఫుట్ బాల్ ఫైనల్ లో ఫ్రాన్స్ పైన అర్జెంటీనా గెలుపొందింది. మొదటి సగంలో అర్జెంటీనా రెండు గోల్స్ సాధించగా, రెండవ సగంలో ఫ్రాన్స్ రెండు గోల్స్ చేసింది. తర్వాత అదనంగా ఇచ్చిన సమయంలో అర్జెంటీనా, ఫ్రాన్స్ చెరో గోల్ సాధించాయి. అందువల్ల ఫ్రీకిక్ అవకాశం ఇచ్చారు. అర్జెంటీనా నాలుగు అవకాశాలలోనూ మూడు అవకాశాలను గోల్స్ గా మార్చుకోగా ఫ్రాన్స్ రెండు అవకాశాలను మాత్రమే సద్వినియోగం చేసుకున్నది. అందువల్ల ఫ్రాన్స్ పైన అర్జెంటీనా 4-2 గోల్స్ తేడాతో గెలిచింది.
మెస్సీ అర్జెంటీనాకు రెండు గోల్స్ చేయగా, అంజెల్ డీ మారియా మూడో గోల్ చేశాడు. ప్రాన్స్ తరఫున మూడు గోల్స్ నూ కిలియన్ ఎంబప్పె సాధించడం విశేషం. ఆట రసవత్తరంగా సాగింది. 1978,1986లో అర్జెంటీనా ప్రపంచ కప్ గెలుచుకుంది. 36 ఏళ్ళ తర్వాత మళ్ళీ అర్జెంటీనా ప్రపంచ కప్ గెలుచుకున్నది. మెస్సీ చివరి ప్రపంచ కప్ మ్యాచ్ ఇదే అనుకుంటున్న తరుణంలో అతని పూనికతో ప్రపంచ కప్ గెలుచుకోవడం విశేషం.