• కేసీఆర్ లేదా జగన్ పీవీ కుటుంబానికి సముచిత గౌరవం ఇవ్వాలి
• ముఖేశ్ అంబానీ సూచించిన వ్యక్తి కన్నా పీవీ తనయుడు నయం కాదా?
• పీవీ ప్రభాకరునికి “గ్రహణం”
వందేళ్ల పీవీకి ఒక్క టిఆర్ఎస్ తప్ప ఏ పార్టీ సముచితమైన గౌరవం ఇవ్వడం లేదు. కాంగ్రెస్ పీవీ పట్ల చూపిన వివక్షకు తగిన మూల్యం చెల్లించుకుంటోంది ఇవ్వాళ సోనియా చుట్టూ ఒక నలుగురైదుగురు తప్ప అంతా తమ స్వస్థలాలకు వెళ్లి పూర్వ వైభవాన్ని నెమరేసు కుంటున్నారు కాంగ్రెస్ పార్టీ అవసానదశకు చెరుకుంది. సోనియా వెంట ఉన్న వారు కూడా “జీ హుజూర్” అనే వారే తప్పా స్వతంత్రంగా పార్టీని రథ సారథులై నడిపించే వారు లేరు! మౌన ముని మన్మోహన్ సింగ్ కూడా అనారోగ్యంతో కుస్తీ పడుతున్నారు. కాంగ్రెస్ వృద్ధ నేతలు ఇంట్లో కూర్చొని ఇతర పార్టీల వార్తలు చూస్తున్నారు తప్ప, కాంగ్రెస్ పార్టీ వార్తలే తెర మీద కనబడడం లేదని తల బద్దలు కొట్టుకుంటున్నారు. “పేపర్ టైగర్లు” అవుదామన్నా వారి ఇంటి వైపు విలేకరులు కన్నెత్తి కూడా చూడడం లేదు.
పీవీని తెరమీదికి తెచ్చింది తెరాసే:
ఇలాంటి దశలో తెలంగాణ తేజం, తెలుగు రాష్ట్రం పేరును ప్రపంచానికి చాటిన పీవీని తెర మీదకు తెచ్చిన టిఆర్ఎస్ పార్టీ వెంటనే ఆయన కుమార్తెను కానీ కుమారుడిని పార్లమెంట్ కు పంపితే జాతీయ పార్టీలకు బుద్ధి వచ్చేది. ఆర్థిక సంస్కరణల యోధుడు పీవీని స్మరించు కోవడానికి తద్వారా లోకానికి దేశానికి ఆయన చేసిన సేవలు పుత్రిక లేదా పుత్రుని సాక్షిగా చెప్పక తప్పని పరిస్థితి ఆ పార్టీలకు ఏర్పడేది. కానీ మిగతా పార్టీలను దెబ్బతీయడానికి పీవీ శత జయంతి ఉత్సవాలను టీఆర్ఎస్ ఘనంగా నిర్వహిస్తోంది తప్పా, ఆయన కుమారుడిని అక్కున చేర్చుకోలేక పోయింది.
Also Read: వాణిదేవి సేఫ్ గేమ్ ఆడారా?
వైఎస్ ఆర్ చొరవ:
పివీ మరణాంతర పరిణామాల్లో ఢిల్లీకి వెళ్లి అప్పటి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ ఆర్ అప్పటికప్పుడే మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసి హుసేన్ సాగర్ ఒడ్డున స్థలం కేటాయించి అక్కడే అంత్యక్రియలు జరిపించి “జ్ఞానభూమి” గా నామకరణం చేసి ఆదర్శం గా నిలచిన వైఎస్సార్ పుత్రుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి. వందేళ్ల పీవీ శత జయంతిని ఆంధ్రలో కూడా ఘనంగా నిర్వహించే సత్తా జగన్ కు ఉంది అలా చేయడానికి సమర్థుడు కూడా. వెంటనే పీవీ తనయుణ్ణి ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్య సభకు పంపితే కేసీఆర్ లాగా జగన్ కు ఓటు బ్యాంకు ఉండేది! పీవీ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అనే విషయాన్ని జగన్ మరిచారు. పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ సూచించిన వ్యక్తికి ప్రాధాన్యత ఇచ్చిన జగన్ పీవీ కుమారునికి కూడా ప్రాదాన్యత ఇస్తే బాగుండేది. తెలుగు రాష్ట్రాల్లో దేవునిగా పూజించే పీవీని వైఎస్సార్ పార్టీ విస్మరించిన మాట అక్షర సత్యమే.
బీజేపీ చేసింది శూన్యం:
ఇక బీజేపీ పీవీ మన ఠీవి అని చెప్పుకునే తెలంగాణ బీజేపీ వారు కూడా ఆయన తనయుణ్ణి అక్కున చేర్చుకున్న దాఖలాలు లేవు. సోనియా మీద కోపంతో అలిగిన గులాబీ నబీ ఆజాద్ ను రాజ్యసభ కు తన పార్టీ తరఫున పంపుతామన్నా ప్రధాని మోడీ పీవీ తనయుడికి రాజ్యసభ ఇస్తే ఈ శతజయంతి ఉత్సవాల సందర్భంగా పీవీ ఆత్మ సంతృప్తి పడేది. బిజెపీకి కూడా పీవీ పై సవతి తల్లి ప్రేమే. ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడంలో దిట్ట అయిన చంద్రబాబు తెలంగాణలో తన బావమరిది హరికృష్ణ కూతురు సుహాసినిని కూకట్ పల్లిలో నిలిపినట్టు తన బలం తో ఆంధ్ర పెద్దల సభకు పీవీ తనయుణ్ణి పంపితే తెలంగాణ లో ఓటు బ్యాంకు పెరిగేది. అలా కాకుండా పీవీ తనయ మీద ఎమ్మెల్సి ఎన్నిక్కల్లో పోటీకి దించి ఉన్న ఓటు బ్యాంకు ను పొగుట్టుకుంది!
Also Read: కేసీఆర్ వ్యూహం లో పీవీ ఓటు బ్యాంక్…?
పీవీ తనయుడు మౌనముద్ర వీడితే బాగుండేది:
ఇలాంటి దశలో పీవీ తనయుడు మౌన ముద్ర వీడితే బాగుండేది! తండ్రి లాగా ఇంట్లో కూర్చుంటే వచ్చే పదవులు కావు! పీవీ గారి ఇద్దరు తనయులు పీవీ రంగారావు గారికి రాజేశ్వరరావు గారికి రాష్ట్ర కేంద్ర స్థాయిలో సముచిత స్థానం లభించింది, అది పీవీ జీవించి ఉన్నప్పటి ముచ్చట. ఇప్పుడు ఆ ఇద్దరూ కుమారులు స్వర్గస్థులయ్యారు. మిగిలిన కుమారుడు పీవీ ప్రభాకర రావు రాజకీయ రంగంలో ఉన్నారు. వివాద రహితుడు అయిన ఆయనను ఏ పార్టీ అక్కున చేర్చుకోక పోవడం విచారించదగ్గ విషయం. అయితే ఆయనకు కు ఉన్న బలహీనత అల్లా మస్కా కొట్టరాక పోవడం, డబ్బులు పార్టీలకు ఇవ్వలేక పోవడం దానికి తోడు రాజకీయ ఆసక్తి ఉన్నా ఇంటికి వచ్చి పదవులు ఇచ్చే కాలం ఏనాడో పోయింది.
రాజకీయాలు జీర్ణం కావడం లేదా?
దానికి తోడు ప్రొటోకాల్స్ లో ఉన్నత శిఖరాలను చూసిన వాడు కాబట్టి ఈ నాటి రాజకీయ పార్టీల వ్యవస్థ జీర్నించు కోలేక సతమతం అవుతున్నారు. ఇక ప్రధాని తనయుడిగా సామాన్య జీవితం గడుపుతున్న ప్రభాకర రావు రాజకీయాలలో డబ్బు ప్రవాహాన్ని చూసి జంకుతున్నారేమో!? ఇక తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకునే అవకాశం ప్రభాకర రావుకు వస్తే తన సత్తా చూపవచ్చు అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అన్నట్టు కాంగ్రెస్ ను తిట్టలేదు ఇంకో పార్టీ ఆశ్రయం పొందలేక పోవడం వల్ల ఆయన ప్రభాకర తేజానికి “గ్రహణం” పట్టింది ఈ గ్రహణం వీడాలంటే ధైర్యం చేయాలి. ఆ ధైర్యం పార్టీలు ఇవ్వాలి. ఆ మాటకు వస్తే సురభి వాణీదేవి ధైర్యం చేశారనే చెప్పాలి. హైదరాబాద్ -రంగారెడ్డి- మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలికి పోటీ చేయాలన్న ముఖ్యమంత్రి ప్రతిపాదనను అంగీకరించి ముందడుగు వేయడం వల్లనే ఈ రోజు ఆమె పోటీలే ఉన్నారు. వార్తలలో ఉన్నారు. ప్రభాకరరావు కూడా సాహసం చేస్తేనే పదవి వరిస్తుంది.
Also Read: వంగర రూపు మారనుందా?