సెటైర్
ట్రింగ్ ట్రింగ్ ఫోను మోగుతోంది…
హలో … ఎవరూ … నర్మదా … ఎలాఉన్నావ్.. చాల్రోజులైంది .. కదా ఫోన్ చేసి .. ఓ యస్సెస్ … ఐ రిమంబర్ … అవును నీకు ఫిఫ్టీ థౌజండ్ ఇవ్వనే లేదు కదూ నేను సారీ మర్చిపోయానబ్బా …
నీకు పేటీఎమ్ ఉందా? లేదా పోనీ తేజ్ యాప్ ఉందా … గూగుల్ మనీ ఫోన్ పే ఇలాంటి యాప్లేవీ లేవా?
ఎలాగబ్బా నేనీ మధ్య ఇంట్లోంచీ బయటకు రావడమే లేదు..
లాక్ డౌన్ లేదు ఓకే అయినా సరే…
లాస్ట్ టైమ్ ఎప్పుడో …ఫస్ట్ లాక్ డౌన్ తర్వాత…
మా బన్నీగాడి ఫ్రెండ్ బర్త్ డే అంటే అలా కార్లో … జూబ్లీ చెక్ పోస్ట్ నియర్ బై ఉంటుంది కదా… ఏంటదీ రెస్టారెంట్ పచ్చట్సో పాడో అక్కడకు వెళ్లా … అబ్బ హెవీ ట్రాఫికబ్బా … కార్లున్నా … పెద్దగా బయటకు రాకుండా ఉండడానికే ట్రై చేస్తున్నా…
మూవీస్ కూడా … ఎందుకు మనం థియేటర్ కు వెళ్లి చూడాలి … వి హావ్ హోం థియేటర్స్ .. కదా… జస్ట్ టిక్కెట్లు ఆన్ లైన్లో కొనేస్తే … త్రూ సర్వీస్ ప్రొవైడర్ … మన హోమ్ థియేటర్ లోకి నేరుగా మూవీని పంప్ చేయొచ్చు కదా…
వై షుడ్ వి .. గో ఫర్ దట్ మూవీ ఇన్ హెవీ ట్రాఫిక్ అంట్ పొల్యూషన్ … ఐ వాంట్ టూ టాక్ దిజ్ మేటర్ విత్ ఫిలిం పర్సనాల్టీస్ అనుకో …
అయినా రీసెంట్ టైమ్స్ లో… ఓటీటీలు చూడ్డంలో కోవిదులమయ్యామ్ కదా… ఓకే
ఇవేవీ కాకపోయిన ఏదో పనికి బయటకు వెళ్లాల్సొస్తుంది కదా … అంటున్నావా?
నీకో విషయం తెల్సా? వి ఆల్ ఆర్ లివ్ ఇన్ యాప్ వరల్డ్ యునో …
టోటల్ నా పన్లన్నీ యాప్స్ తోనే చేయించేసుకుంటున్నాను…
ఇంకో సంగతి యు మస్ట్ నో ఇట్ … ఫర్దర్ గా టోటల్ మార్కెట్ ఆన్లైన్ అయిపోతుంది … ఈ కడుతున్న మాల్స్ అన్నీ శుద్ద దండగ …
నో ఆఫ్ లైన్ షాప్స్ మాల్స్ ఎక్సెట్రా … దేఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ డయ్యింగ్ ఏరియా … యునో … టోటల్ ఆన్ లైనే… మార్కెట్ రన్ బై ఓన్లీ యాప్స్ … నర్మదా …
ఏపీ లో కాపిటల్ అంటూ గొడవ చేసే వాళ్ళని చూస్తే నవ్వొస్తుంది.
ఇన్ దిస్ నెట్ డేస్…
ఎంప్లాయిస్ అందర్నీ వర్క్ ఫ్రం హోమ్ అనేస్తే పోతుంది కదా…
కోర్టు ల తో సహా… అన్నీ ఆన్ లైన్ చేసి యాప్ కాపిటల్ సారీ క్లౌడ్ కాపిటల్ ప్లాన్ చేయొచ్చు కదా..
థాంక్ గాడ్…
డీ మానిటైజేషన్… అండ్ కోవిద్
ఇవి కనుక రాకపోతే… మనం ఇంకా రైతుబజార్ బ్యాచ్ గానే మిగిలిపోయేవాళ్ళం…
ప్రతి చెడు ఓ మంచి కూడా చేస్తుంది అనేది మా బామ్మ… అంటే ఇదే…
నువ్వన్నది కరక్టే .. నేను తీసుకునేప్పుడు నీ దగ్గర కాష్ గానే నీ ఇంటికొచ్చి మరీ తీసుకున్నాననుకో .. కాకపోతే ఆయన నాకు అక్కౌంట్ ట్రాన్స్ ఫర్ చేస్తారు …
నేను సాధ్యమైనంత వరకు కాష్ వాడడం మానేశాను…
అన్నీ డిజిటల్ ట్రాన్సా క్షన్సే…
ఇప్పుడు కాయగూరలు కొనుక్కోవలంటే …
గ్రీన్ లీవ్స్ యాప్ తో ఆర్డర్ చేసేస్తాం … ఆన్ లైన్ పేమెంట్ .. డోర్ డెలివరీ …
బట్టలు వాషింగో ఇస్త్రీనో అనుకో … లాండ్జి షాప్ యాపు …
ఒక వేళ బ్రేక్ ఫాస్టో మరోటో చేసుకోలేకపోతే ఫుడ్డీ వరల్డ్ యాపూ …
సినిమా టిక్కెట్ల కోసం … టుక్ యువర్ టిక్కెట్ యాపూ …
ఒక వేళ ఫేషియల్లో పాడో చేయించోకావాలంటే బ్రైట్ యువర్ ఫేస్ యాపూ …
డిన్నర్ కు డిన్నర్ కిచెన్ యాపూ …
ఈ లోపు ప్రపంచంలో ఏం జరుగుతోందో తెల్సుకోడానికి ఎటూ సవాలక్ష న్యూస్ యాప్స్ ఉన్నాయి కదా…
వై షుడ్ వియ్ కమ్ఔట్ సైడ్ …
పైగా డర్టీ ట్రాఫిక్ తో పాటు లాటాఫ్ పొల్యూషను… గ్లామర్ దారుణంగా దెబ్బతింటోంది.. తెల్సా … మా బన్నీ గాడ్ని కూడా ఔట్ సైడ్ పంపడం నాకస్సలు ఇష్టం ఉండదు తెల్సా?
ఈయన్ని కూడా సాధ్యమైనంత వరకు బయటకు వెళ్లద్దనే చెప్తాన్నేను…
వర్క్ ఫ్రం హోం బెటర్ కదా…
మా బన్నీ గాడ్ని కూడా స్కూల్ కి వద్దనే అంటున్నా…
ఎందుకంటే.. లెర్న్ ఫ్రమ్ హోం యాప్స్ చాలా ఉన్నాయి కదా…
అందులో చాలా వరకు వరల్డ్ ఫేమస్ వర్సిటీలు లింకై ఉన్నవే… సో … డోంట్ గో అవే ఫ్రమ్ హోమ్ ఫర్ బ్లడీ లెర్నింగన్నమాట…
అలాగే వర్క్ ఫ్రమ్ హోం చూస్కోమని ఆయనతో తెగ పోరు పెడుతుంటాను…
దే టూ ఆర్ నాట్ హియర్ మీ అనుకో ..
మా ఫాదర్ అప్పుడే చెప్పాడే… గుడ్లవల్లేరు నుంచీ వచ్చాడు … ఆ బ్యాక్ వర్డ్ నెస్ భరించడం కాస్త కష్టం … అని …
బట్ ఐ నాట్ లిజననుకో …
కాకపోతే హాండ్సమ్ గా ఉంటాడనీ … ఒబిడియంట్ అనీ చేసేసుకున్నాన్లే… దట్ ఈజ్ డిఫరెంట్ … ఓకే … ఐ థింక్ … ఐ వాంట్ స్టార్ట్ ఎ అన్ లైన్ ప్రోపగాండా ఆఫ్ లివ్ విత్ యాప్స్ … ఇఫ్ యు హ్యావ్ ఫోననుకో …
టోటల్ వరల్డ్ నీ చేతిలో ఉన్నట్టే .. ఆర్డర్ ఎనీ థింగ్ గెట్ యువర్ డోర్ స్టెప్స్ … ఎంత హాయే… నర్మదా …
జస్ట్ ఇమేజిన్ మన ఊళ్లో … మనం హైస్కూల్లో చదువుకునేప్పుడు … తమలపాకులు కొనాలన్నా పడుతూ లేస్తూ … ఆ నెహ్రూ బొమ్మ సెంటర్ దాకా పోయేవాళ్లమా కాదా … ఆ దిక్కుమాలిన విలేజ్ లో … వాటే డేస్ వాటే డేసే … దారుణం కదా…
ఓకే ఓకే …
అస్సలు తిరక్కపోతే మరీ లావైపోయి షేపవుటైపోతామంటావా … నోనోనో..
దేరార్ సోమెనీ ఆన్ లైన్ జిమ్ యాప్స్ ఆర్దేర్ …
నో ప్రాబ్లమ్ మనం యాపులకు పన్జెప్పే పనికి జస్ట్ ఓ హాఫెనవర్ గ్యాపిస్తే వాళ్లు ఇంటికే వచ్చి జిమ్ చేయించి వెళ్లిపోతారు… కనుక షేపవుట్ అయ్యే ప్రసక్తే లేదు…
యస్ యస్ ఐ అండర్ స్టాండ్ .. హెల్త్ యాప్స్ చాలా ఉన్నాయి … దట్టూ వెరీ వెరీ ఆధరైజ్డ్ హాస్పిటల్స్ యాప్స్ ఉన్నాయి… వి గెట్ ట్రీట్మెంట్ త్రూ యాప్స్ యునో … ఇఫ్ ఇటీజ్ ఎమర్జన్సీ దే మూవజ్ టూ హాస్పటల్ కదా … వాటీజ్ దేర్ …
వాట్ యు సే.. వాట్ యుసే … . ఒక వేళ పోతే యుమీన్ చనిపోతే … అప్పుడైనా బయటకు పోక తప్పదంటావా …
దటీజ్ ఆల్సో నాటే బిగ్ ప్రాబ్లమ్ … నర్మదా … బాడీ పికప్ యాప్స్ ఆర్ దేర్ కదా … యు జస్ట్ బుక్ ఎ వెహికిల్ అన్డ్ గో ఫర్ హ్యాపీ ఎటర్నల్ జర్నీ అంతే … లైఫీజ్ షో సింపుల్ నర్మదా … యు జస్ట్ డౌన్ లోడ్ యాప్స్ దట్సాల్ …
అండ్ ఐ వాంట్ టు సే ఒన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ నర్మదా … యాప్ యూజింగ్ ను మించిన దేశభక్తి లేదు తెల్సా …
డబ్బే రద్దు చేసి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెట్టేస్తే దేరీజ్ టోటల్ ట్రాన్సెపరెన్సీ కదా … అప్పుడు బ్లాక్ మనీ అనే మాటే ఉండదు.. అంచేత కూడా మనం యాప్ వరల్డ్ ను ఎంకరేజ్ చేయాలి …
బై నర్మదా … సారీ … ఇఫ్ పాజిబుల్ యు డౌన్ లోడ్ పేటీఎం ఆర్ ఎనీ అదర్ మనీ ట్రాన్సపర్ యాప్ ఓకే … నాట్ పైత్యం నర్మదా … పెటిఎం … దెన్ కాల్ మీ … ఐ విల్ సెండ్ మనీ … ఓకే … డార్లింగ్ … నైస్ టాక్ విత్యూ … టేక్ కేర్ బైబై …
Also read: బాపు రమణలు ఎంతటి దుర్మార్గులో తెలిస్తే అవాక్కవుతారు!