- పంచాయతీ ఎన్నికలపై ఎస్ఈసీ నిఘా
- గూగుల్ ప్లే స్టోర్ లో ఈ-వాచ్ యాప్
- రేషన్ వాహనాలను పరిశీలించిన నిమ్మగడ్డ
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ నిమ్మగడ్డ ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల్లో అక్రమాలు, ప్రలోభాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం రూపొందించిన ఈ-వాచ్ యాప్ ను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆవిష్కరించారు. విజయవాడ ఎన్నికల సంఘం కార్యాలయంలో ఆవిష్కరించిన ఈ యాప్ పంచాయతీ ఎన్నికల్లో ఫిర్యాదుల చేసేందుకు ఉపయోగపడుతుందని నిమ్మగడ్డ తెలిపారు. ఎన్నికల్లో జరిగే అక్రమాలు, ప్రలోభాలకు సంబంధించి ఎస్ఈసీకి నేరుగా బాధితులు ఫిర్యాదు చేయవచ్చని అధికారులు తెలిపారు . గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ-వాచ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకునే సదుపాయం ఉందని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఫిర్యాదుల స్వీకరించి పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ ను కూడా ఎస్ఈసీ నిమ్మగడ్డ ప్రారంభించారు.
రేషన్ డోర్ డెలివరీ వాహనాలను పరిశీలించిన ఎస్ఈసీ:
ఆంధ్రప్రదేశ్ లో రేషన్ డోర్ డెలివరీ వాహనాలను ఈ రోజు (ఫిబ్రవరి 3) ఉదయం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తనిఖీలు చేశారు. రేషన్ వాహనాలపై పార్టీ గుర్తులు వద్దని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఎస్ఈసీ కార్యాలయానికి పౌర సరఫరాల శాఖ అధికారులు తీసుకొచ్చారు. వాహనాలపై వేసిన రంగులు, ఫొటోలను ఎస్ఈసీ నిశితంగా పరిశీలించారు.
ఇదీ చదవండి: అంతా వైఎస్సార్ ఆశీస్సులతోనే ..అంటున్న నిమ్మగడ్డ
ఎన్నికల నిబంధనలకు రేషన్ డోర్ డెలివరీ :
పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నందున ఇంటింటికీ రేషన్ అందించే వాహనాలపై రాజకీయ నేతల ఫొటోలు, పార్టీ గుర్తులు ఉండరాదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ సర్కార్ గతంలో ఫిబ్రవరి ఒకటి నుంచి ఇంటింటికీ రేషన్ పంపిణీ చేయాలని రేషన్ వాహనాలను ప్రారంభించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పంపిణీకి అనుమతిని కోరుతూ ప్రభుత్వం హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఎన్నికల నిబంధనలకు లోబడే రేషన్ వాహనాల ద్వారా పంపిణీ కార్యక్రమం చేపట్టాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇదీ చదవండి: మంత్రుల దూకుడుకు నిమ్మగడ్డ బ్రేక్
Hi, here on the forum guys advised a cool Dating site, be sure to register – you will not REGRET it https://bit.ly/2MpL94b