- సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చిన బొత్స, పెద్దిరెడ్డి
- నిమ్మగడ్డపై తీవ్రస్థాయిలో విమర్శలు
- సీఎస్ కు నిమ్మగడ్డ మరో లేఖ
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి మధ్య పోరు తారాస్థాయికి చేరింది. ఒకరి కొకరు నువ్వా నేనా అన్న స్థాయిలో పోరు సాగుతోంది. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగానే ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డపై జగన్ సర్కార్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేసింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై బొత్స, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శాసనసభ స్పీకర్ కార్యాలయంలో నోటీసులు ఇచ్చారు. ఎన్నికల కమిషనర్ పరిథి దాటి మంత్రులపై వివాదస్పద వ్యాఖ్యాలు చేశారని నోటీసులో తెలిపారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: నిమ్మగడ్డ లేఖాస్త్రాలకు అధికార పార్టీ విరుగుడు మంత్రం
మంత్రుల స్పీడ్ కు నిమ్మగడ్డ బ్రేక్:
మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ సలహాదారులు ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ వాహనాల వినియోగంపై సీఎస్ ఆదిత్యానాథ్ దాస్ కు పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు నిమ్మగడ్డ సీఎస్ కు మరో లేఖాస్త్రం సంధించారు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ సలహాదారులు ఎన్నికల ప్రచారానికి ప్రభుత్వ వాహనాలను వాడుకోకుండా చూడాలని నిమ్మగడ్డ సీఎస్ ను కోరారు. ప్రభుత్వంలో భాగంగా ఉన్నవారు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న చోట్ల ప్రజా ప్రతినిధులు పర్యటించకుండా ఆంక్షలు విధించాలని కోరినట్లు సమాచారం. పార్టీ కార్యాలయాల్లో ప్రెస్ మీట్లు పెట్టరాదని ఎస్ఈసీ రాసిన లేఖలో తెలిపారు.
ఇదీ చదవండి: తొలిదశ సం”గ్రామం”
కులధృవీకరణ పత్రాల జాప్యంపై ఎస్ఈసీ సీరియస్:
పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వకుండా ఆటంకాలు కలిగిస్తున్నారని అధికారులు కావాలనే జాప్యం చేస్తున్నారని ప్రతిపక్షాలు ఎన్నికల సంఘం దృష్టికి తెచ్చాయి. దీనిపై నిమ్మగడ్డ అధికారులకు పలు సూచనలు చేశారు. నామినేషన్ వేసే సందర్భంలో అభ్యర్థులు పాత కుల ధృవీకరణ పత్రాలు సమర్పించినా తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.