పదే పదే
ముసలి పార్టీ ని దెప్పి ఏం
లాభం ?
మా కమలం వికసించాక
ఎవరు ఎటు పోతేనేం ?
విభజన హామీల పాతర
ఎప్పుడో జరిగిపోయింది !
కమలానికి
ఇప్పుడు జాతీయ జాతర
జాతరలో అన్ని దేవతలకూ
నైవేద్యాలు అందవు
కేంద్రం చెట్టు పళ్ళు
ఎగరలేని
ఆంధ్రాకి ఎప్పుడూ అందవు!
పొట్టి శ్రీరాముల ఆత్మ క్షోభ సాక్షిగా
విభజన తరువాత
ఆంధ్రా
ఒక తుఫాను తర్వాత
పెంకులెగిరిన ఇల్లు
మనకూ ఫలితం
నిల్లు !
-వీరేశ్వర రావు మూల
Also read: కాలం ఆగిపోయింది
Also read: అంతర్వాహిని
Also read: విలువలు
Also read: సెన్సేషన్ నాగా
Also read: యత్ర నార్యస్తు లభతే,రమంతే తత్ర రాక్షసాః