Sunday, December 22, 2024

ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ సంచలన నిర్ణయం

  • ఏపీ ఎన్నికల సంఘం జేడీపై క్రమశిక్షణ చర్యలు
  • కరోనా రక్షణ ఏర్పాట్లపై ప్రభుత్వానికి సిఫారసు

రాష్ట్ర ఎన్నికల సంఘం జేడీ జీవీ సాయిప్రసాద్ పై ఎన్నికల సంఘం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. నాలుగు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 9 నుంచి ఎన్నికల కమిషన్ కార్యాలయంలో సీనియర్ ఉద్యోగులు ఎవరూ సెలవులు పెట్టరాదని అందరూ అందుబాటులో ఉండాలని ఎన్నికల కమిషనర్ సూచించారు. అయితే ఎస్ఈసీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ సంయుక్త సంచాలకులు సాయిప్రసాద్ 30 రోజుల సెలవుపై వెళ్లడమే కాకుండా సహ ఉద్యోగులను ప్రభావితం చేశారని ఎస్ఈసీ అభిప్రాయపడ్డారు.  దీన్ని  క్రమశిక్షణారాహిత్యంగా పరిగణిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఇతర ఉద్యోగులను సెలవుపై వెళ్లేలా సాయి ప్రసాద్ ప్రభావితం చేశారని ఎలక్షన్ కమిషన్ ఆరోపించింది.

ఇది చదవండి: ఎన్నికల నిర్వహణపై నిమ్మగడ్డ దూకుడు

ప్రస్తుత ఎన్నికలకు విఘాతం కలిగించేలా జేడీ ప్రవర్తించారని ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టికల్ 243 రెడ్ విత్, ఆర్టికల్ 324 ప్రకారం విధుల నుంచి సాయిప్రసాద్ ను తొలగిస్తున్నట్లు ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇతర ప్రభుత్వ సర్వీసుల్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా విధులు చేపట్టడానికి వీల్లేదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

ఐకమత్యంగా పనిచేద్దామని ఉద్యోగ సంఘాలకు పిలుపు:

పంచాయతీ ఎన్నికల నిర్వహణ పనులను ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్  వేగిరం చేశారు. ఎన్నికల నిర్వహణపై ఉద్యోగ సంఘాలు ఆందోళన వెలిబుచ్చిన నేపథ్యంలో పోలింగ్ సిబ్బంది భద్రతకు చర్యలు తీసుకుంటామని నిమ్మగడ్డ స్పష్టం చేశారు. కొవిడ్ రక్షణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బందికి పీపీఈ కిట్లు, ఫేస్ షీల్డ్ లు, శానిటైజర్ లు ఇవ్వాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు కలిసికట్టుగా పనిచేద్దామని ఉద్యోగులకు పిలుపునిచ్చారు.

ఇది చదవండి: ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles