రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. ఎన్నికల విధులు, ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు, నామినేషన్ల ప్రక్రియ ఏర్పాట్లపై సీఎస్ వారికి సూచనలు చేశారు. సమావేశానికి ఉద్యోగ సంఘాల నేతలు చంద్రశేఖర్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు హాజరయ్యారు.
ఇది చదవండి: పంచాయతీ ఎన్నికలు జరపాల్సిందే
ఎన్నికల విధుల్లో భాగంగా ఉద్యోగులు కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. మాస్క్ లు విధిగా ధరించాలని, శానిటైజర్ వాడాలని సీఎస్ తెలిపారు. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కాకపోవడంతో కొత్త షెడ్యూల్ ను ఎస్ఈసీ ప్రకటించారు. కొత్త షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 9 న తొలిదశ, 13న రెండో దశ, 17న మూడో దశ, 21న నాలుగో దశ ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఇది చదవండి: బదిలీలు ఆపండి: నిమ్మగడ్డ
సీఎస్ కు ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులు:
భేటీలో తాము ఎన్నికల విధులకు సిద్ధంగానే ఉన్నామని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలిపారు. అయితే 50 ఏళ్లు దాటిని మహిళా ఉద్యోగులను పోలింగ్, కౌంటింగ్ విధులకు దూరంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. ధీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి పోలింగ్ విధులనుంచి మినహాయింపును ఇవ్వాలని కోరారు. ఎన్నికల విధుల్లో భాగంగా కొవిడ్ సోకి ఎవరైనా మరణిస్తే 50 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని సీఎస్ కు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు
ఇది చదవండి: పంచాయతీ ఎన్నికలపై తెగని పంచాయతీ