హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల ఆరోపణలకు సంబంధించిన ఈడీ కేసును సీబీఐ కోర్టుకు బదిలీ చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. సీబీఐ కోర్టులో ఆరు, నాంపల్లి కోర్టులో ఒక ఛార్జ్ షీట్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టొరేట్ దాఖలు చేసింది. నాంపల్లి కోర్టులోని ఈడీ కేసు కూడా సీబీఐ కోర్టుకే బదిలీ చేయాలని జగతి పబ్లికేషన్స్ తరఫు న్యాయవాది కోరారు. జగతి పబ్లికేషన్స్ అభ్యర్థనను హైకోర్టు అంగీకరించింది. అరబిందో, హెటిరో ఛార్జ్ షీట్‌ను కూడా సీబీఐ కోర్టుకు బదిలీ చేయాలని హైకోర్టు ఆదేశించింది.