- తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసిన కోర్టు
ఈడీ కోర్టులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల విచారణ కేసు ఈ నెల 21 కి వాయిదా పడింది. అక్రమాస్తులకు సంబంధించిన కేసు విచారణ ఈ రోజు ( జనవరి 11) జరిగింది.వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, నిత్యానంద రెడ్డి, శరత్ చంద్రారెడ్డి, రాం ప్రసాద్ రెడ్డిలు విచారణకు హాజరయ్యారు. ఈ రోజు విచారణకు హాజరుకావాలని సీఎం జగన్ ను ఈడీ కోర్టు రెండ్రోజుల క్రితం ఆదేశించింది. అయితే ఈ రోజు (జనవరి 11) నెల్లూరు జిల్లాలో అమ్మఒడి రెండో విడత కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించాల్సిఉంది. అదే సమయంలో కోర్టుకు హాజరుకావాలని ఈడీ సమన్లు జారీచేసింది. ఈ నేపథ్యంలో అధికారిక కార్యక్రమాలు ఉన్నందున ఈ రోజు విచారణకు జగన్ హాజరు కావడంలేదని ఆయన తరపు న్యాయవాది ఈడీ కోర్టుకు వెల్లడించి మినహాయింపు పొందారు.
నాంపల్లి కోర్టు నుంచి ఈడీ కోర్టుకు అరబిందో, హెటిరో భూ కేటాయింపుల ఛార్జిషీట్ ఇటీవల బదిలీ అయ్యింది. అరబిందో, హెటిరో భూ కేటాయింపుల ఛార్జిషీట్ ను విచారణకు స్వీకరించిన ఈడీ కోర్టు ఈ నెల 11న విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ సీఎం జగన్ కు నోటీసులు జారీ చేసింది.
ఇది చదవండి: ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ఈడీ కోర్టు సమన్లు