- ఆన్ లైన్ ద్వారా ఆర్డినెన్స్ ఆమోదించిన కేబినెట్
- 3 నెలల కోసం ఆర్డినెన్స్ ను తెచ్చిన ప్రభుత్వం
ఏపీ బడ్జెట్ ఆర్డినెన్సుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 90 వేల కోట్లతో బడ్జెట్ ఆర్డినెన్స్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ ఆన్ లైన్ లో ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహర్ రెడ్డి పరిశీలించిన తరువాత దీన్ని వేర్వేరుగా మంత్రులందరికీ ఆర్థికశాఖ అధికారులు ఆన్ లైన ద్వారా పంపించారు. దీనికి మంత్రులు అంగీకారం తెలపడంతో బడ్జెట్ ఆర్డినెన్స్ కు ఆమోద ముద్ర పడింది. ఆ ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం గవర్నర్‌కు పంపిస్తారు. ఆయన ఆమోదం తర్వాత ఆర్డినెన్స్ అమల్లోకి రానుంది. మే నెలాఖరు లేదా జూన్ లో నిర్వహించే శాసనసభ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు.
Also Read: పరిపాలనా రాజధాని విశాఖకు కొత్త సొబగులు
కరోనాతో వాయిదాపడ్డ సమావేశాలు:
వాస్తవానికి మార్చి నెలలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించి.. బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ఆమోదించాల్సి ఉంది. ఈ నెల మూడో వారంలో గాని, నెలాఖరులో బడ్జెట్ సెషన్ నిర్వహించాలని భావించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, కరోనా వ్యాక్సినేషన్ తోపాటు కరోనా సెకండ్ వేవ్ కేసులు పెరగటం, తిరుపతి లోక్‌సభకు ఉప ఎన్నిక ఉండటంతోనే ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. గత సంవత్సరం కూడా కరోనా కారణంగా బడ్జెట్ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు.
వేతనాలు, సంక్షేమ పథకాల అమలు:
మార్చి 31తో 2020-21 సంవత్సరం ముగియనుండటంతో ప్రస్తుత వ్యయాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, నవరత్నాల పథకాల అమలు, ఇతర పాలనా ఖర్చుల నిర్వహణ కోసం 3 నెలల కాలానికి గాను ప్రత్యేక ఆర్డినెన్స్ ను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏప్రిల్ నెలలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రభుత్వం ఆమోదించనుంది.
Also Read: జస్టిస్ ఎన్వీ రమణపై వైఎస్ జగన్ ఫిర్యాదును కొట్టివేసిన సుప్రీంకోర్టు