వోలేటి దివాకర్
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 16 నెలల్లో యుద్ధం అన్ని చెప్పడం వెనుక అసలు కారణం అదేనన్నారు . ప్రభుత్వంపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని ముందుగానే ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో ఉన్నారని తెలిపారు. బీజేపీ కూడా ఇందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీ ప్రభుత్వ అవినీతిపై పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ముందు ప్రభుత్వ అవినీతి, ఇచ్చిన హామీలపై చార్జీషీటు వేస్తామన్నారు.
Also read: ఎపికి జగన్ ద్రోహం చేస్తారా?! ఉండవల్లి సలహా పాటిస్తారా?
మరోవైపు ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన పార్టీలు కూడా ముందస్తు ఎన్నికలకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. దీనిలో భాగంగానే నారా లోకేష్ పాదయాత్రకు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ రథయాత్ర కు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి 2024లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. పాదయాత్రలు, రథయాత్రలు, అధికార వైస్సార్సీపీ గృహ సారథుల నియామక ప్రకటనతో రాష్ట్రంలో ముందస్తు రాజకీయాలు ఊపందుకున్నాయి.
Also read: శనివారం … పోలవరం!