శ్రీనివాసన్, పార్థసారథిరెడ్డి, రామేశ్వరరావు
టీటీడీ పాలకమండలి సభ్యులుగా 25 మందిని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జాబితాను బుధవారంనాడు విడుదల చేసింది. టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి కొనసాగుతారు. టీటీడీ బోర్డు సభ్యులుగా స్థానం పొందడానికి చాలా మంది ప్రయత్నించారు.గతం కంటే జాబితా నిడివిని ఈ సారి తగ్గించారు.
ఏపి నుంచి..
పొకల అశోక్ కుమార్, మల్లాడి కృష్ణారావు, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, గొల్ల బాబురావు, బుర్రా మధుసూధన్ యాదవ్, కాటసాని రాంభూపాల్ రెడ్డి, నందకుమార్, శంకర్, విశ్వనాథరెడ్డి, లక్ష్మీనారాయణ
తెలంగాణ నుంచి..
రామేశ్వర రావు, పార్థసారథి రెడ్డి, లక్ష్మి నారాయణ, మారంశెట్టి రాములు, కల్వకుంట విద్యా సాగర్ రావు,
మన్నే జీవన్ రెడ్డి, రాజేష్ శర్మ
తమిళనాడు నుంచి…
శ్రీనివాసన్, ఎమ్మెల్యే నందకుమార్, కన్నయ్య
కర్ణాటక నుంచి…
శశిధర్, ఎమ్మెల్యే విశ్వనాథ్ రెడ్డి.
మహారాష్ట్ర నుంచి…
రాజేశ్ శర్మ, డాక్టర్ కేతన్ దేశాయ్.
మైహొం జూపల్లి రామేశ్వరరావు, హెటిరో డ్రగ్స్ పార్థసారథి, మారంశెట్టి శ్రీరాములు, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ముంబయ్ కి చెందిన రాజేశ్ శర్మ, ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాస్ రెండో సారి పాలకమండలిలో సభ్యంత్వం పొందగలిగారు. వ్యాపారవేత్త మారుతి, ఆడిటర్ సనత్, యంయస్ యన్ ల్యాబ్స్ జీవన్ రెడ్డి, కోల్ కొతాకి చెందిన సౌరభ్ కు కూడా పాలకమండలిలో సభ్యత్వం దక్కింది.